బెంగాల్లో రీ పోలింగ్ - సీఈసీ జ్ఞానేష్ అరెస్ట్..! దీదీ డిమాండ్..!

గత 10 నెలల కాలంలో తోటి ఎన్నికల కమిషనర్లకు తెలియకుండా 14 వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, బీజేపీకి అనుకూలంగా ఎన్నికల ఫలితాల్ని మర్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను తక్షణం అరెస్టు చేసి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Demands ) డిమాండ్ చేసారు. అంతే కాదు బెంగాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఆమె ఇవాళ కోరారు.

CEC జ్ఞానేష్ పై వేటుకు విపక్షాల డిమాండ్..! ముప్పేట దాడితో EC క్లారిటీ..!
CEC జ్ఞానేష్ పై వేటుకు విపక్షాల డిమాండ్..! ముప్పేట దాడితో EC క్లారిటీ..!

ఈ ఏడాది పశ్చిమ బెంగాల్లో నిర్వహించిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణను పర్యవేక్షించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలో ఎన్నికలు రాజీపడ్డాయని మమతా బెనర్జీ ఆరోపించారు. కాబట్టి ఇందుకు బాధ్యుడైన సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను అరెస్టు చేసి, ఆయనపై క్రిమినల్ విచారణ జరపాలని దీదీ డిమాండ్ చేశారు. బీజేపీ, జ్ఞానేష్ కుమార్ ఒక జాయింట్ వెంచర్ కంపెనీ అని, వాళ్లిద్దరూ కలిసి బెంగాల్ ఎన్నికలను దోచుకున్నారని ఆరోపించారు. మీకు ఏమాత్రం నైతికత ఉన్నా, మా ఎన్నికలను తిరిగి ఇచ్చేయండి అని మమత కోరారు.

Mamata Demands West Bengal Repolls Seeks Arrest and Criminal Action Against CEC Gyanesh Kumar

బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో తమ ఓటమికి ఎస్ఐఆర్ ప్రక్రియనే కారణమని దీదీ ఆరోపించారు. ఇది అధికార బీజేపీకి అనుకూలంగా పనిచేసిన ప్రక్రియ అని ఆమె అభివర్ణించారు. ఇందులో సీఈసీ జ్ఢానేష్ కుమార్, బీజేపీ కుమ్మక్కై పనిచేశారని ఆరోపించారు.
ఎస్ఐఆర్‌ అధికార పార్టీకి ఒక ప్రత్యేక ప్రోత్సాహంగా అభివర్ణిస్తూ, ఎన్నికల సంఘం బీజేపీకి ఇందులో రక్షణ కల్పించిందని తెలిపారు. కాబట్టి ఈ సీఈసీని అరెస్టు చేయాలి, పదవిలో కొనసాగడానికి నైతిక అధికారం ఆయనకు లేదని విమర్శించారు. అలాగే జ్ఞానేష్ కుమార్ ఎన్నికలు నిర్వహించిన, ఎస్ఐఆర్ ప్రక్రియను పర్యవేక్షించిన అన్ని రాష్ట్రాల్లోనూ తిరిగి ఎన్నికలు జరపాలని మమత డిమాండ్ చేశారు.జ్ఞానేష్ కుమార్‌ను అరెస్టు చేసి, ఆయనపై క్రిమినల్ చర్యలు ప్రారంభించాలని కోరారు.

Mamata Demands West Bengal Repolls Seeks Arrest and Criminal Action Against CEC Gyanesh Kumar
ఎన్నికల సంఘంలో ముసలం..! కమిషనర్లకు తెలియకుండా సీఈసీ 14 నిర్ణయాలు?
ఎన్నికల సంఘంలో ముసలం..! కమిషనర్లకు తెలియకుండా సీఈసీ 14 నిర్ణయాలు?

జ్ఞానేష్ కుమార్ ఏకైక పని బీజేపీ అహంకారాన్ని సంతృప్తిపరచడమే అని మమత ఆరోపించారు. ఆయన వల్లే బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ, అలాగే 2025-26లో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించిందని పేర్కొన్నారు. మీరు ఆ పదవిలో కొనసాగినంత కాలం మేం నిరసనలు కొనసాగిస్తూనే ఉంటామన్నారు. ఇండియా కూటమి మొత్తం దీనిపై నిరసన తెలుపుతుందన్నారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ప్రజా తిరుగుబాటు జరగాలని మమత పిలుపునిచ్చారు. సీఈసీపై బీజేపీ తమ అభిశంసన తీర్మానాన్ని అనుమతించలేదని, కానీ ఇకపై దాని అవసరం లేదని, ఇప్పుడు ఆయనను అరెస్టు చేయాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+