కాకినాడ, నర్సాపురం కు దసరా ప్రత్యేక రైళ్లు - డేట్స్, రూట్, టైమింగ్స్..!!

దసరా సెలవుల కోసం రైల్వే ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటోంది. దసరా వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రైళ్లలో ఇప్పటికే రిజర్వేషన్ వెయిటింగ్ లిస్టు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ ఘనంగా జరుపుకుంటారు. విద్యా సంస్థలకు సెలవులు కావటంతో ప్రయాణాలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో.. ప్రయాణీకుల డిమాండ్ మేరకు రైల్వే శాఖ సికింద్రాబాద్ నుంచి కాకినాడ, చర్లపల్లి నుంచి నర్సాపురంకు ప్రత్యేక రైళ్లు ప్రకటించింది.

దసరా, దీపావళి వేళ రైల్వే శాఖ రద్దీ మార్గంలో ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉ్న డిమాండ్ మేరకు నిర్ణయాలు తీసుకుంటోంది. రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తూ .. రైళ్ల వివరాలను ప్రకటించింది. ఇప్పటికే చర్లపల్లి- నర్సాపురం మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వే అధికారులు తాజాగా సికింద్రాబాద్-కాకినాడ టౌన్(07039) ప్రత్యేక రైలు నిర్వహణ పైన ప్రకటన చేసారు. ఈ రైలు అక్టోబర్ 7వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతీ బుధవారం సికింద్రాబాద్‌లో 7.10 గంటలకు బయల్దేరి గురువారం ఉదయం 8 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో కాకినాడ-సికింద్రా బాద్(07040) రైలు కాకినాడలో గురువారం 21.00 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఈ ట్రైన్ అక్టోబర్ 8 నుంచి నవంబర్ 26 వరకు సర్వీసులు అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

 దసరా రద్దీ వేళ ఏపీ మీదుగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు - రూట్లు, షెడ్యూల్..!!
దసరా రద్దీ వేళ ఏపీ మీదుగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు - రూట్లు, షెడ్యూల్..!!
railway-announces-special-trains-for-dasara-holidays-between-secunderabad-kakinada-here-the-schedu

ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా నిర్ణయాలు

సికింద్రాబాద్ - కాకినాడ ప్రత్యేక రైలు చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయ వాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకొట స్టేషన్లలో ఆగనుంది. ఈ రైల్లో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ఇక జల్నా-యలహంక మధ్య ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజుల పాటు పొడిగించారు. జల్నా-యలహంక (07601) రైలు అక్టోబర్ 4 నుంచి నవంబర్ 25 వరకు పొడిగించారు. అదే విధంగా చర్లపల్లి- నర్సాపురం మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. అక్టోబరు 4నుంచి నవంబరు 29 వరకు ప్రతీ ఆదివారం రాత్రి 10 గంటలకు నర్సాపూర్‌ నుంచి 07062 ప్రత్యేక రైలు, అక్టోబరు 5నుంచి నవంబరు 30వరకు ప్రతీ సోమవారం రాత్రి 7.30 గంటలకు చర్లపల్లి నుంచి 07063 ప్రత్యేక రైలు బయల్దేరుతాయని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+