పురందేశ్వరికి కీలక పదవి వెనుక - మోదీ మార్క్ లెక్కలు..!!
ఏపీ కేంద్రంగా బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. తాజాగా ప్రకటించిన పార్టీ జాతీయ కమిటీ లో ఏపీకి ప్రాధాన్యత పెరిగింది. పురందేశ్వరికి ఏకంగా పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టారు. రాం మాధవ్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న వేళ.. తెలంగాణ నేతలకు ఎలాంటి పదవులు లేకుండా.. ఏపీకి పెరిగిన ప్రాధాన్యత పైన ఇప్పుడు కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. మోదీ మార్క్ రాజకీయం పై చర్చ మొదలైంది.
మోదీ 4.0 లక్ష్యంగా బీజీపీ కొత్త వ్యూహాలతో సిద్దం అవుతోంది. దక్షిణాది పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అందులో భాగంగా ముందుగా బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం ప్రకటించారు. అందు లో దక్షిణాదిలో తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కింది. ప్రత్యేకంగా ఏపీ నుంచి రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి స్థానం సంపాదించారు. అదేవిధంగా ఏపీకే చెందినా.. ఢిల్లీ కేంద్రంగా పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్ నేత, ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు రాంమాధవ్ సైతం ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఇదేసమయంలో బీజేపీ జాయింట్ కోఆర్డినేటర్ గా విష్ణువర్ధన్ రెడ్డిని నియమించారు. దీంతో ఏపీ విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని అంటున్నారు. ఇప్పటికే ఏపీలో పొత్తులు ఉన్నా.. పార్టీ సొంతంగా ఎదగటం పైనే ముఖ్య నేతలు ఫోకస్ చేసారు. పొత్తులో ఉన్న సమయంలోనే పార్టీ బలోపేతం చేయాలని భావిస్తున్నారు.

ఏపీ కేంద్రంగా బీజేపీ కొత్త లెక్కలు
అందులో భాగంగానే ఏపీ నుంచి ఎంపిక చేసిన రాజ్యసభ సభ్యుల.. ఎమ్మెల్సీల విషయంలోనూ తొలి నుంచి పని చేసిన వారికే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక.. పురందేశ్వరి బీజేపీ లో చేరిన తరువాత కీలక బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర మంత్రి అవుతారని భావిస్తున్న వేళ.. పార్టీ ఉపాధ్యక్షురాలి గా బాధ్యతలు కేటాయించారు. దీని ద్వారా ఏపీలో భవిష్యత్ రాజకీయాల్లో భాగంగా బీజేపీ పక్కా వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది. ఏపీలో సామాజిక సమీకరణాలు.. ఇతర పార్టీల బలాలను పరిగణలోకి తీసుకొని అడుగులు వేస్తోంది. ఎన్టీఆర్ కుమార్తెకు బీజేపీలో కీలక బాధ్యతలు ఇవ్వటం తో పాటుగా.. పార్టీ నేతలకు తాజాగా చేస్తున్న దిశా నిర్దేశంతో రాష్ట్రంలో బీజేపీ ఆలోచన ఏంటనేది క్లియర్ గానే ఉంది. దక్షిణాది పైన మోదీ - షా ద్వయం ప్రత్యేక వ్యూహాల అమలుతో ముందుకు వెళ్తున్నారు. దీంతో.. ఇప్పుడు ఏపీ కేంద్రంగా తమ మార్క్ రాజకీయం చేస్తున్న ఈ ఇద్దరి ఆలోచనల పైన పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి కర చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications