"పాకిస్థాన్ జిందాబాద్" అన్న బాలీవుడ్ స్టార్ హీరో.. సోషల్ మీడియాలో రియాక్షన్స్ చూస్తే..!
ప్రస్తుతం పాకిస్థాన్- భారత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత ఉద్రిక్తత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొససాగుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో పాకిస్థాన్ జిందాబాద్ అని అనడం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన అన్నది నిజ జీవితంలోకాదు.. ఓ సినిమాలో ఆయన పాకిస్థాన్ జిందాబాద్ అనాల్సి వచ్చింది. ఆ మూవీనే 'ఉడ్తా తీర్' తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.

అయితే ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురాన్ పాకిస్థాన్ స్పై గా నటిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయింది. ట్రైలర్ చాలా సరదాగా సాగుతుంది. భారత్ కు వచ్చి గతం మర్చిపోయిన ఓ పాకిస్థాన్ స్పై.. తనను తాను ఇండియన్ స్పైగా అనుకుంటే జరిగే కామెడీనే ఈ సినిమా అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 2026 అక్టోబర్ 9న రిలీజ్ కానుంది. ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానా సరసన బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ హీరోయిన్ గా నటించింది. ఓవైపు ఫుల్ కామెడీ, యాక్షన్, అడ్వెంచర్ తో ఈ ట్రైలర్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇక 'ఉడ్తా తీర్' సినిమాను ఆకాష్ ఏ కౌశిక్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. ఫస్ట్ సినిమా అయినప్పటికీ ఎలాంటి తడబాటు లేకుండా చక్కగా సినిమాను అనుకున్న విధంగా తీసినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ తో పాటుగా కీలక నటులు రాహుల్ బోస్, రామ్ కపూర్, సుహైల్ నయ్యర్, గుల్షన్ గ్రోవర్, ముకుల్ దేవ్, రఘుబీర్ యాదవ్, బ్రిజేంద్ర కాలా, సందీప్ ఆనంద్, సుప్రియా పిల్గాం కర్, స్మితా తాంబే లాంటి భారీ తారాగణం సందడి చేస్తుంది. ఇక ఈ చిత్రానికి ధర్మ ప్రొడక్షన్స్, సిఖ్యా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై కరణ్ జోహార్, అదార్ పూనావాలాలు నిర్మాతలుగా తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ 9 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పిస్తుందో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications
