బంగారంలో బంపర్ లాభాలు

గ్లోబల్ మార్కెట్‌లో లాభాల స్వీకరణ, అమ్మకాల ఒత్తిడి కారణంగా నేడు దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుదల బాట పట్టాయి. ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతూ వచ్చిన వీటి రేట్లు.. నేడు కూడా అదే ధోరణిని ప్రదర్శించాయి. అటు కొనుగోలుదారులు మరిన్ని పెట్టడానికి ముందుకు వస్తోండటంతో బంగారం ధరలు ఊపందుకుంటోన్నాయి. మరోవైపు ముడి చమురు ధరలు మళ్లీ పెరగడం కూడా దీనికి ఓ కారణమైంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర 0.5 శాతం పెరిగింది. ఔన్స్ ధర 4,395 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. స్పాట్ సిల్వర్ వెండి ధరలో ఒకశాతం మేర పెరుగుదల చోటు చేసుకుంది 65.50 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వీటికి అనుగుణంగా క్రూడాయిల్ రేట్ల గ్రాఫ్ కూడా పైపైకి ఎగబాకుతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర ఒక శాతం పెరిగి బ్యారెల్‌కు 85, బ్రెంట్ క్రూడ్ 0.5 శాతం పెరిగి 91 డాలర్ల పైన కొనసాగుతోంది.

Gold Rates Rose at MCX in India After Profit-Taking Pullback Silver Under Pressure reliable hedge

సోమవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే ఈ ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో 240 రూపాయల మేర పెరుగుదల నమోదైంది. 22 క్యారెట్లు రూ. 200, 18 క్యారెట్లు రూ. 160 రూపాయల మేర పెరిగాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య నూతన ఒప్పందానికి సంబంధించిన అవకాశాలు సన్నగిల్లడం చమురు ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది.తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని పొడిగించడంపై ఆసక్తి లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.

బంగారం ధరల్లో అంచనాలు తలకిందులు
బంగారం ధరల్లో అంచనాలు తలకిందులు

వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,589, 22 క్యారెట్లు - రూ. 14,290, 18 క్యారెట్లు - రూ. 12,070

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,589, 22 క్యారెట్లు- రూ. 14,290, 18 క్యారెట్లు - రూ. 11,692

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,589, 22 క్యారెట్లు- రూ. 14,290, 18 క్యారెట్లు - రూ. 11,692

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,589, 22 క్యారెట్లు- రూ. 14,290, 18 క్యారెట్లు - రూ. 11,692

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,589, 22 క్యారెట్లు- రూ. 14,290, 18 క్యారెట్లు - రూ. 11,692

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,589, 22 క్యారెట్లు- రూ. 14,290, 18 క్యారెట్లు - రూ. 11,692

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+