Umrah Visa: ఉమ్రా భక్తులకు షాక్, ఇక ఇలా మక్కా వెళ్లలేరు.. సౌదీ కొత్త రూల్

పవిత్ర మక్కా నగరంలో ఉమ్రా పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్లే ముస్లిం సోదరులకు సౌదీ అరేబియా ప్రభుత్వం ఒక అత్యంత ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ఏడాది పాటు ఎన్నిసార్లయినా ప్రయాణించే వెసులుబాటు ఇచ్చే 'వన్ ఇయర్ మల్టిపుల్ ఎంట్రీ ఉమ్రా వీసా' చేతిలో ఉంది కదా అని అనుకున్నప్పుడు అల్లాహ్ దర్శనానికి బయలుదేరదామంటే ఇక కుదరదు. చేతిలో చెల్లుబాటయ్యే వీసా ఉన్నప్పటికీ, ప్రతిసారి ప్రయాణించే ముందు కొత్తగా సర్వీస్ ప్యాకేజీతో పాటు ప్రత్యేకానుమతి పత్రాన్ని తీసుకోవడం తప్పనిసరి చేస్తూ సౌదీ హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది.

Saudi Arabia Umrah Visa Update Mandatory Service Package and Permit Required Before Every Mecca Visit

'నుసుక్' యాప్‌లో ప్యాకేజీ బుకింగ్ తప్పనిసరి!

సౌదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన ప్రకారం.. భక్తులు ప్రయాణమయ్యే ప్రతీసారి తమ పర్యటన తేదీలకు అనుగుణంగా 'నుసుక్' (Nusuk) పోర్టల్ ద్వారా గుర్తింపు పొందిన ఏజెన్సీల నుండి సర్వీస్ ప్యాకేజీని బుక్ చేసుకోవాలి. ఈ ప్యాకేజీలో బస, రవాణా సౌకర్యాలు పొందుపరిచి ఉంటాయి. దీంతోపాటు ప్రయాణానికి ముందే నుసుక్ యాప్ ద్వారా ప్రత్యేక ఉమ్రా పర్మిట్ (అనుమతి పత్రం) కూడా పొంది తీరాలి. వీసా వాలిడిటీ ఉన్నంత మాత్రాన నేరుగా విమానం ఎక్కి వచ్చేస్తే సౌదీలో దిగనివ్వరని స్పష్టం చేసింది.

US Visa:సెప్టెంబర్ 15 నుంచి రూల్స్ ఛేంజ్! రెండు కీలక ఫారమ్‌లలో మార్పులు..
US Visa:సెప్టెంబర్ 15 నుంచి రూల్స్ ఛేంజ్! రెండు కీలక ఫారమ్‌లలో మార్పులు..

రోజుల పరిమితిపై ప్రత్యేక దృష్టి!

ఈ ఏడాది కాలపరిమితి వీసా ఉన్నప్పటికీ ప్రయాణికులు గుర్తుంచుకోవాల్సిన మరొక కీలక విషయమేమిటంటే.. ఒక్క ఏడాదిలో అన్ని పర్యటనలు కలిపి గరిష్టంగా 90 రోజులు మాత్రమే సౌదీలో ఉండటానికి అనుమతి ఉంటుంది. ఏడాది వీసా అనేది కేవలం ఆ సమయంలో ఎన్నిసార్లయినా వచ్చి వెళ్లేందుకు ఇచ్చిన వెసులుబాటు మాత్రమే తప్ప, నిరంతరం అక్కడే ఉండటానికి కాదని అధికారులు తేల్చి చెప్పారు. భక్తులకు వసతి, రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఈ ముందస్తు ప్యాకేజీ నిబంధన పెట్టామని సౌదీ తెలిపింది.

e-Visa: ఏకంగా 11 కొత్త ద్వారాలు తెరిచిన భారత్!
e-Visa: ఏకంగా 11 కొత్త ద్వారాలు తెరిచిన భారత్!

ముందస్తు ప్లాన్ ఉంటేనే ప్రయాణం సుఖమయం!

తొలిసారి ఉమ్రా వీసాకు దరఖాస్తు చేసుకునే వారు ముందుగా నుసుక్ వేదికగా సర్వీస్ ప్యాకేజీ కొనుగోలు చేసి, ఆ తర్వాత వీసా ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకే ఏడాదితో రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఉమ్రా దర్శనానికి వెళ్లాలని ప్రణాళిక వేసుకునే భక్తులు, ప్రతిసారీ ఈ బుకింగ్, పర్మిట్ ప్రక్రియను తిరిగి పూర్తి చేయాల్సిందేనని సౌదీ స్పష్టం చేసింది. కాబట్టి ప్రయాణానికి సిద్ధమయ్యే భక్తులు తాజా నిబంధనలను ఒకసారి పరిశీలించుకుని ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+