క్షీరాబ్ది ద్వాదశికి ఉన్న ప్రాధాన్యతలు ఇవే: రెండో సోమవారం కావడంతో..!

ఇవ్వాళ కార్తీకమాసం రెండో సోమవారం. క్షీరాబ్ది ద్వాదశి కూడా. మిగులు ఏకాదశి ఈ తెల్లవారు జామునే ముగుస్తుంది. ద్వాదశి ప్రవేశిస్తుంది. శివకేశవులకు అత్యంత ప్రీతకరమైన మాసంగా భావించే కార్తీకంలో ప్రతి రోజుకూ ఓ ప్రత్యేకత ఉంటుంది. ప్రతి తిథికీ ఓ ప్రాముఖ్యత ఉంటుంది. అధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న నెల ఇది. ఈ నెలలో ప్రతి సోమవారం శైవక్షేత్రాలను సందర్శించడానికి భక్తులు ప్రాధాన్యత ఇస్తారు. అలాగే- శ్రీమన్నారాయణుడిని పూజిస్తారు.

కార్తీకమాసం రెండో సోమవారం నాడు క్షీరాబ్ది ద్వాదశి పండగ కూడా కలిసి వచ్చింది. కార్తీక శుక్లపక్షం 12వ రోజును క్షీరాబ్ది ద్వాదశిగా జరుపుకొంటుంటారు. చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి, హరిబోధిని ద్వాదశి, బృందావని ద్వాదశిగా పిలుస్తుంటారు.
క్షీరాబ్ది ద్వాదశి నాడు దేవదేవుడు లక్ష్మీసమేతుడై, ముక్కోటి దేవతలతో కలిసి బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజుని బృందావని ద్వాదశిగా పిలుస్తారు.

శ్రీమన్నారాయణుడు యోగనిద్ర నుంచి లేచిన మరుసటి రోజు కావడం వల్లే దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం.. శ్రీమహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగనిద్రలోకి వెళ్తాడు. తొలి ఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్లే స్వామివారు మళ్లీ కార్తీకమాసం తొలి ఏకాదశి నాడు కళ్లు తెరుస్తాడు. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలు స్వామివారిని సహస్ర నామాలతో పూజిస్తారు. బ్రహ్మాండ స్వరూపుడిని దర్శించుకుంటారు. ఆ మరుసటి రోజు శ్రీమహా విష్ణువు లక్ష్మీ సమేతుడై బృందావనానికి వస్తాడు. అందుకే క్షీరాబ్ది ద్వాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది.

Know the significance of Ksheerabdi Dwadasi or Chiluka Dwadasi

క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసీపూజ చేయాలని పురాణాలు స్పష్టం చేస్తోన్నాయి. తులసితో పాటు ఉసిరి చెట్టును పూజించడం వల్ల పాపాలు హరించుకుపోతాయని ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం. తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. తులసి, ఉసిరిచెట్ల వద్ద పూజ చేయాలి. ఉసిరి చెట్టు వద్ద ఎనిమిది దీపాలను వెలిగించాలి. దీపారాధన చేయాలి. ధూప, దీప నైవేద్యాలను సమర్పించాలి. ఇలా చేయడంవల్ల అష్టదిక్పాలకుల అనుగ్రహం కలుగుతుంది.

ప్రతి సోమవారం శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. దీపారాధనలతో విరాజిల్లుతుంటాయి. ఈ నెల పొడవునా ఒకరకమైన ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిస్తుంటుంది. దీప కాంతులతో శైవ, వైష్ణవాలయాలు ధగధగమంటూ వెలిగిపోతుంటాయి. నదీ స్నానాలు, జపతాపాలు, గ్రామాల్లో తెల్లవారు జామునే వినిపించే భక్తి గీతాలు, ఘంటా నాదాలతో ఓ అనిర్వచనీయమైన అనుభూతిని పంచుతుంటుంది ఈ కార్తీకమాసం. ఓ పాజిటివ్ వైబ్రేషన్స్‌ను కలిగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+