హైదరాబాద్ లో హజ్ ఆఫీస్!
హైదరాబాద్‌ః ప్రస్తుతం ముంబయ్ లో వున్న హజ్ కమిటీ కేంద్ర కార్యాలయాన్ని హైదరాబాద్ కు తరలించాల్సిందిగా అంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని వాజ్‌పేయిని కోరారు. ఈ మేరకు చంద్రబాబు ప్రధాని వాజ్‌పేయికి ఓ లేఖ రాశారు.
హైదరాబాద్ నుంచి గల్ఫ్ కు పలు విమానాలు వున్నాయని,పైగా భాగ్యనగరం అన్ని రాష్ట్రాల ప్రజలకు అనుకూలంగా వుంటుందని చంద్రబాబు ప్రధానికి రాసిన లేఖలోపేర్కొన్నారు. హజ్ కేంద్ర కార్యాలయాన్ని ముంబయ్ నుంచి కొత్త ఢిల్లీకి తరలిస్తున్నారనే వార్తలు రావడంతో ఆ కార్యాలయాన్ని హైదరాబాద్ తరలించాల్సిందిగా చంద్రబాబు ప్రధానికికోరారు. ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ శాఖ మంత్రి, రాష్ట్ర హజ్ కమిటీ అధ్యక్షుడు ఎన్.ఎం.డి. ఫరూఖ్ ఈవిషయాన్ని వెల్లడించారు. సెంట్రల్ హజ్ కమిటీ కార్యాలయానికి అవసరమైన స్థలాన్ని, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా వున్నదని చంద్రబాబు ఆ లేఖలోపేర్కొన్నారు.
హైదరాబాద్ నుంచి జడ్డాకు నేరుగా విమానసర్వీసులు వున్నాయని, హజ్ క్యాంప్ ను సమర్థనీయంగా నిర్వహించినందుకు హైదరాబాద్ క్యాంప్ కు బహమతి కూడా లభించిందని ఫరూఖ్ చెప్పారు.
వచ్చే ఏడాది నుంచి హజ్ కోటాను పెంచినట్లు కూడా మంత్రి చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఆరు వేల మంది ఆంధ్రా యాత్రికులు హజ్ వెళ్లవచ్చునని ఈ ఏడాదికంటే ఈ కోటా రెండు వేలుపెరిగిందిని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications