ఇంటికి నైరుతి గేటు ఉంటే ఏం జరుగుతుంది? ఏం చెయ్యాలి?

ఇంటికి వాస్తు చాలా అవసరం. వాస్తు లేకుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు సుఖంగా, సంతోషంగా జీవించటం కష్టం. ఇక ఇంటికి ఎంట్రన్స్, బయటకు వెళ్ళే ఎగ్జిట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి గేటు ఎటు ఉండాలి అనేది ప్రతీ ఒక్కరూ కచ్చితంగా తెలుసుకుని ఉండాలి. ఇంటికి నైరుతి గేటు ఉండటం వాస్తు శాస్త్రం ప్రకారం తీవ్రమైన దోషంగా పరిగణించబడుతుంది.

నైరుతి దిక్కుకు అధిపతి రాహువు.. అందుకే ఈ సమస్యలు

ఇది కుటుంబంలో ఆర్ధిక అస్థిరత, అనారోగ్యం, మనస్పర్థలు మరియు స్థిరత్వం లోపించడానికి కారణమవుతుంది.వాస్తు ప్రకారం నైరుతి దిక్కుకు అధిపతి రాహువు మరియు నైరుతి రాక్షసుడు. ఇది 'భూమి' తత్వానికి ప్రతీక. అనవసర ఖర్చులు, వ్యాపారంలో నష్టాలు, అప్పులపాలు కావడం జరుగుతుంది. కుటుంబ సభ్యులకు తరచూ అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో గొడవలు, బంధువులతో విభేదాలు, నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం వంటివి ఎదురవుతాయి.

southwest gate Risks Of A Southwest Facing main Gate And Effective Remedies For Home Prosperity

ఎందుకు మంచిది కాదు?

నైరుతిదిశ అనేది ఎప్పుడూ 'బరువుగా', 'మూసివేసి' ఉండాలి. ఇది ఇల్లు నిలకడగా ఉండటానికి పునాది లాంటిది. ఈ దిశలో గేటు లేదా తలుపుపెట్టడం వల్ల ఆ స్థానం బలహీనపడి, బయట నుండి ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. సాధ్యమైనంత వరకు నైరుతి గేటును మూసివేసి, వేరేదిశలో ఉత్తరం లేదా తూర్పు ప్రధాన ద్వారం ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. కానీ గేటు మార్చడం సాధ్యం కాకపోతే కొన్ని పరిహారాలు తప్పక పాటించాలి.

జూలై 7న బుధుడి తిరోగమనంతో వీరికి అన్ని విధాలా కలిసిరావటం ఖాయం!
జూలై 7న బుధుడి తిరోగమనంతో వీరికి అన్ని విధాలా కలిసిరావటం ఖాయం!

ఈ పరిహారాలతో వాస్తు దోషం నుండి విముక్తి

నైరుతి గేటుకు బయటవైపు ఎదురుగా ఒక భారీ పాలరాతితో చేసిన వినాయకుడి విగ్రహాన్ని లేదా ప్రతిమను అమర్చాలి. గేటుకు రెండు వైపులా గద లేదా గాయత్రి మంత్రం ఉన్న టైల్స్ కానీ, హనుమంతుని టైల్స్ అతికించాలి. గేటును చాలా బలంగా, మందంగా ఉండేలా మార్చాలి. గేటు పైన లేదా చుట్టూ వాస్తు పిరమిడ్లను అమర్చడం ద్వారా నెగిటివ్ ఎనర్జీని అడ్డుకోవచ్చు. గేటుకు నలుపు, నీలం లేదా ముదురు ఆకుపచ్చ రంగులు వేయకూడదు. దీనికి బదులుగా లేత గోధుమ, క్రీమ్ లేదా ఎర్త్ కలర్స్ వాడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+