రష్యాకు అమెరికా ఆపన్నహస్తం.. ప్లేగ్ వ్యాధి విజృంభణ నేపథ్యంలో ట్రంప్ కీలక నిర్ణయం..
రష్యాలో ప్లేగ్ మహమ్మారి తీవ్ర కలకలం రేపుతోంది. సైబీరియాలోని యాంటీ ప్లేగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లోని ఓ ల్యాబ్ లో గతనెల 25 వ తేదీన ప్రమాదవశాత్తు ప్లేగ్ బ్యాక్టీరియా ఉన్న పైపు పగిలి అక్కడే పనిచేసే 28 ఏళ్ల ఓ మహిళా ల్యాబ్ టెక్నీషియన్ ప్లేగు వ్యాధితో మరణించింది. దాంతో మృతురాలితో కాంటాక్ట్ లో ఉన్న దాదాపు 200 మందిని గుర్తించి కఠినమైన క్వారంటైన్ ను విధించారు. అయితే రష్యాలో ప్లేగ్ విజృంభణకు సంబంధించి అమెరికా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటోంది. అలాగే రష్యాలో ప్రస్తుత పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రష్యాలో అనుమానాస్పద ప్లేగ్ వ్యాధి పెరుగుతున్న క్రమంలో ఆ దేశానికి అవసరమైన సాయాన్ని అందించేందుకు అమెరికా ముందున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
" రష్యాలో పరిస్థితిని మేము వేగంగా పరిశీలిస్తున్నాం. మేము రష్యాలో ప్లేగ్ పరిస్థితి గురించి తెలుసుకున్నాం. ఈ వ్యాధి విస్తరించకుండా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ దేశం ఉన్నా అమెరికా సాయం చేస్తుంది. రష్యాలో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాల్సింది" అని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఈ విషయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడలేదని తెలిపారు. కానీ రష్యాకు సపోర్ట్ చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అన్నారు.
అలాగే రష్యాలో ప్లేగ్ వ్యాధి విస్తరణపై యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాధికి సంబంధించిన మరిన్ని వివరాలను రష్యా ఎప్పటికప్పుడు బయటకు రిలీజ్ చేయాలని తద్వారా మిగాతా దేశాలు అప్రమత్తం ఉండే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం రష్యాలో పరిస్థితిని ప్రతి గంటకూ తాము పర్యవేక్షిస్తున్నామని వివరించారు. ఇక ఇదే అంశంపై క్రిమ్ లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ మాట్లాడుతూ ప్లేగ్ వ్యాధిపై బయట వచ్చే రూమర్స్ ను నమ్మొద్దని.. రష్యా ప్రభుత్వం విడుదల చేసే అధికారిక డేటాను మాత్రమే అనుసరించాలని కోరారు. ఘటన జరిగిన సైబీరియాలోని యాంటీ ప్లేగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ఎలాంటి అదనపు కేసులు బయటపడలేదని తెలిపారు.

మరోవైపు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధికార ప్రతినిధి క్రిస్టియన్ లిండ్ మీయర్ మాట్లాడుతూ.. ప్లేగ్ వ్యాధి విస్తరణ అనేది పెద్దగా లేదని తెలిపారు. ఇప్పటికే కాంటాక్ట్ అయిన అందరినీ మానిటరింగ్ చేస్తున్నామని వారిలో ఎలాంటి లక్షణాలు ఇప్పటి వరకూ నమోదు కాలేదని స్పష్టం చేశారు. ఇక కరోనా మహమ్మారి 2020, 2021 లో ప్రపంచాన్ని వణికించిన నేపథ్యంలో ప్లేగ్ వ్యాధి.. కొవిడ్-19 మాదిరిగా మహమ్మారిగా మారే అవకాశాలు తక్కువగానే ఉంటాయని తెలిపారు. కొవిడ్ 19 తో దీన్ని పోల్చలేమని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
