AP కేబినెట్ భేటీ: కొత్త పెన్షన్లు, కొత్త ఉద్యోగాలు- మంత్రులకు బిగ్ టాస్క్..!!
కీలక అంశాల పైన ఏపీ మంత్రివర్గం నిర్ణయాలు తీసుకోనుంది. పెండింగ్ హామీల అమలుతో పాటు గా కొత్త పెన్షన్లు.. అమరావతిలో భూ కేటాయింపులు.. జాబ్ క్యాలెండర్ తో సహా ఎల్ నినో పరిస్థితుల పైన మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవుతున్న సమయంలో.. మంత్రులకు సీఎం చంద్రబాబు టాస్క్ ఫిక్స్ చేయనున్నారు. సీట్ల సర్దు బాటుతో పాటుగా.. మూడు పార్టీల సమన్వయం పైనా దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది. ఈ భేటీ పూర్తయిన వెంటనే చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.
ఏపీ మంత్రివర్గ భేటీలో కీలక అంశాలు చర్చకు రానున్నాయి. పరిపాలనా అంశాలతో పాటు పలు కీలక ప్రాజెక్టులకు సంబంధించిన నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సంస్థలు, పరిశ్రమలకు భూ కేటాయింపులు చేసే ప్రతిపాదనలపై సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. వీటితో పాటు ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇతర ప్రాధాన్యత కార్యక్రమాల పురోగతిపై సమీక్ష చేసే అవకాశం ఉంది. అధికారిక అజెండా తరువాత మంత్రులతో ప్రత్యేకంగా రాజకీయ పరిణామాలపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ప్రభుత్వం అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. స్థానిక పోరులో బీసీ సామాజిక వర్గానికి 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నా... రిజర్వేషన్ల అమలు పైన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

మంత్రులకు దిశా నిర్దేశం
ఇప్పటికే స్థానిక ఎన్నికల పైన చంద్రబాబు- పవన్ మధ్య కీలక మంత్రాంగం కొనసాగింది. 2024 ఎన్నికల నాటి లెక్కలు కాదని.. ప్రస్తుతం పార్టీల బలం ఆధారంగా ఎన్నికల్లో సీట్ల కేటాయింపు ఉండాలని నిర్ణయించారు. ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా కూటమి గెలుపుగా అందరి సమిష్టిగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు. తమ పార్టీ కోరుకుంటున్న పోటీ స్థానాల జాబితాను సీఎం కు పవన్ అందచేసినట్లు సమాచారం. కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం, సీట్ల సర్దు టు అంశాల పై ఇంఛార్జ్ మంత్రులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు. వంద శాతం గెలుపు లక్ష్యంగా పని చేయాలని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. ఇక.. ఈ వారాంతం లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని భావిస్తున్న వేళ.. ఈ రోజు జరుగుతున్న కేబినెట్ భేటీ.. నిర్ణయాల పైన ఆసక్తి నెలకొంది.













Click it and Unblock the Notifications
