సరికొత్త సూపర్ కంప్యూటర్
ముంబాయి: ముంబాయిలోని భాభా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ దేశంలోని ఇతర సంస్థలు డెవలప్‌చేసిన సూపర్ కంప్యూటర్ల కంటే 20-25 రెట్లు ఎక్కువ స్పీడ్‌తో పనిచేసే సూపర్ కంప్యూటర్‌ను డెవలప్ చేసింది.
80 లక్షల రూపాయల వ్యయంతో తయారు చేసిన ఈ 84 నోడ్ అనుపమ పెంటియమ్ సూపర్ కంప్యూటర్ 15 గిగా బైట్స్ స్పీడ్‌తో డేటాను ప్రాసెస్ చేస్తుంది. బార్క్ శాస్త్రవేత్తలు గత ఏడాది డెవలప్ చేసిన 16 నోడ్ సూపర్ కంప్యూటర్ అనుపమ కంటే ఈ కొత్త కంప్యూటర్ 5 రెట్లు ఎక్కువ స్పీడ్‌తోపనిచేస్తుంది.












Click it and Unblock the Notifications