కాకినాడ లోకాంగ్రెస్‌ సారధి ధర్నా

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట ఎంపిటిసి స్ధానంనుంచి తెలుగుదేశం అభ్యర్ధి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పిసిసి అధ్యక్షుడు ఎమ్‌. సత్యనారాయణరావు కాకినాడ కలెక్టర్‌ కార్యలయంముందు శుక్రవారం నాడు ధర్నా నిర్వహించారు.

సామెర్లకోట ఎంపిటిసి స్ధానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధి నామినేషన్‌ ఉపసంహరణవిషయంలో తెలుగుదేశం వారితో కలిసి అధికారులు అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సత్యనారాయణరావు ధర్నా నిర్వహించారు. అవినీతికి పాల్పడ్డ అధికారులను శిక్షించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. అధికార యంత్రాంగంతో కలిసి అధికార తెలుగుదేశం పార్టీ స్ధానిక సంస్ధల ఎన్నికలలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నదని ఆయన ఆరోపించారు.

అంతకు ముందుకు ఆయన కృష్ణా జిల్లా కైకలూరు, కలిదిండి, ముదినేపల్లిలలో జరిగిన ఎన్నికల సభలలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనలో ప్రచారం తప్ప అభివృద్ధి లేకపోవటం వల్లే ఆయన అభివృద్ధిపై బహిరంగ చర్చకు ముందుకు రాలేక పోతున్నారని సత్యనారాయణరావు ఆరోపించారు. స్ధానిక సంస్ధలలో ప్రజాప్రతినిధులను నిమిత్త మాతృలను చేసి అధికార మంతా అధికారులకే చంద్రబాబు కట్టబెట్టారని ఆయన దుయ్యబట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+