కృషి బ్యాంకు
చెన్నై: తాను రాష్ట్ర బిజెపిఅధ్యక్ష పదవికి రాజీనామా చేయలేదని, అనారోగ్య కారణాలవల్ల తనను బాధ్యతల నుంచి తప్పించాలనిఅధిష్ఠానాన్ని కోరానని చిలకం రామచంద్రారెడ్డి స్పష్టంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వైఫల్యానికి,తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకోవడంలో జరిగిన పొరపాట్లకుమనస్తాపం చెంది ఆయన రాష్ట్ర బిజెపిఅధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈనేపథ్యంలో ఆయన చెన్నైలో ఒక ప్రకటనచేశారు.
స్థానిక సంస్థలఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితాలు సాధించకపోవడం పార్టీనాయకులు మనస్తాపానికి గురైన మాట వాస్తవమేనని, అయితే తన రాజీనామాకు కారణం అదికాదని ఆయన అన్నారు. తన స్థానంలో రాష్ట్ర బిజెపిఅధ్యక్షుడిగా సమర్థుడైన నాయకుడ్ని నియమిస్తే పార్టీముందుకు సాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.రాష్ట్రంలో పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు కొదవలేదని ఆయన అన్నారు.
- ఆంధ్ర బిజెపి అధ్యక్షుడు చిలకం రాజీనామా












Click it and Unblock the Notifications