టిఆర్‌ఎస్ పోటీ తప్పు:ఎమ్మెస్సార్
హైదరాబాద్:ప్రాదేశిక ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) పోటీచేయడం తప్పు అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావు అన్నారు. తెలంగాణా రాష్ట్ర సమితి నేతకె. చంద్రశేఖర్ రావుపై ఆయన మంగళవారంవిలేకరుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు.చంద్రశేఖర్ రావు వైఖరి వల్ల తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్నికోరుకోవడం లేదనే భావన నెలకొందనిఆయన అన్నారు. ఒక నిజామాబాద్ జిల్లాలో తప్ప ఎక్కడాటిఆర్‌ఎస్ మెజారిటీ సాధించలేకపోయిందనిఆయన అన్నారు. కాంగ్రెస్, బిజెపిల తోడ్పాటుతోనే తెలంగాణా రాష్ట్ర సాధన సాధ్యమవుతుందనిఆయన అభిప్రాయపడ్డారు. కెసిఆర్ తన వైఖరివల్ల సాధించేది శూన్యమని ఆయన అన్నారు.
వరంగల్ జిల్లా పరిషత్‌లో ఓటమికి కెసిఆర్‌యే బాధ్యుడనిఆయన అన్నారు. మద్దతుకు చంద్రశేఖర్ రావువిధించిన షరతు వల్ల గందరగోళం ఏర్పడివరంగల్ జిల్లా పరిషత్ తెలుగుదేశం వశమైందనిఆయన అభిప్రాయపడ్డారు. అయితే, వరంగల్ జిల్లా పరిషత్‌ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బాసటగా నిల్చిన తమజడ్‌పిటిసి సభ్యులను ముగ్గుర్ని పార్టీ నుంచి సస్పెండ్‌చేసినట్లు, వారిపై ఎన్నికల కమిషన్‌కుఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. వారిని అనర్హులుగా ప్రకటించాలని ఎన్నికలకమిషన్‌ను కోరుతామని ఆయన చెప్పారు.
ఏ పార్టీయైనా తమకుమద్దతిస్తే తీసుకుంటామని, వేరే పార్టీకి తాముమద్దతివ్వబోమని నిర్ణయించుకున్నామని,ఇది తప్పేమీ కాదని ఆయన అన్నారు. తగిన బలం లేనికరీంనగర్, తదితర జిల్లాల్లో కాంగ్రెస్ పోటీకి దిగడాన్నిఆయన సమర్థించుకున్నారు.
కాంగ్రెస్ అక్రమమార్గాల్లో జిల్లా పరిషత్‌లను కైవసంచేసుకోవడానికి సిద్ధపడిందని తెలంగాణా రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావువిమర్శించారు. తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని చెప్పినప్పటికీఅక్రమ మార్గాలను తొక్కిందని ఆయన అన్నారు.మెదక్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించనివైఖరే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications