హార్డ్‌వేర్‌ పరిశ్రమపై సిఐఐటాస్క్‌ఫోర్స్‌

న్యూఢిల్లీ: కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ పరిశ్రమపై సిఐఐ ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ పరిశ్రమ ఎదుర్కుంటున్న పన్నుల భారంతో సహా వివిధ సమస్యలపై ఈ టాస్క్‌ఫోర్స్‌ ఒక నివేదికను తయారు చేస్తుంది. ప్రస్తుతం అతి తక్కువ స్థాయిలో వున్న పిసిల వ్యాప్తిని పెంచాలంటే హార్డ్‌వేర్‌ పరిశ్రమకు ప్రభుత్వ రాయితీలు అవసరమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

కేంద్ర ఐటి మంత్రి ప్రమోద్‌ మహాజన్‌ను కలిసినప్పుడు కూడా ఈ రంగం సమస్యలను వారు మంత్రికి విన్నవించారు. స్థానికంగా హార్డ్‌వేర్‌కు సంబంధించి ఆర్‌అండ్‌డిని ప్రొత్సహించాలని వారు పేర్కొన్నారు. ఈ నెల 11న జరుగనున్న జాతీయ ఐటి సలహా సంఘం సమావేశానికి విస్తృత ఎజెండాను కూడా ఖరారు చేయాలని సిఐఐ టాస్క్‌ఫోర్స్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+