TRS MLC Candidate: కవిత కొత్త వ్యూహం... ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ జర్నలిస్ట్!
రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రేసులో తెలంగాణ రక్షణ సేన పార్టీ కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ జర్నలిస్ట్ ఆకాశ్ కొల్లూరు పేరును పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే వరంగల్ - ఖమ్మం - నల్గొండ స్థానం నుంచి బీసీ వర్గానికి చెందిన నలమాస శ్రీకాంత్ గౌడ్ ను బరిలోకి దింపిన కవిత, రెండవ స్థానంలో కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికే పీఠం వేసి సరికొత్త రాజకీయ వ్యూహాన్ని చాటుకున్నారు.
ఎన్నికల అబ్జర్వర్‌గా చిట్నేని రఘు.. వార్ రూమ్ బాధ్యతల్లో రామ్ కల్యాణ్!
ఎన్నికల్లో విజయామే లక్ష్యంగా పార్టీకి చెందిన సీనియర్ నాయకులకు కీలక బాధ్యతలను అప్పగించారు. హైదరాబాద్ గ్రాడ్యుయేట్ స్థానానికి అబ్జర్వర్, కో ఆర్డినేటర్ గా పార్టీ సీనియర్ నేత డాక్టర్ చిట్నేని రఘును నియమించారు. అదేవిధంగా ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి సమర్థవంతమైన ప్రచార వ్యూహాలు, వార్ రూమ్ మేనేజ్‌మెంట్ ఇన్ ఛార్జిగా ప్రముఖ న్యాయవాది రామ్ కల్యాణ్ చల్లాకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఉమ్మడి జిల్లాల వారీగా బలమైన ఇన్ ఛార్జీల నియామకం
ఎన్నికల క్షేత్రస్థాయి పనితీరును వేగవంతం చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక ఇన్ ఛార్జీలను రంగంలోకి దించారు. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ స్థానానికి సంబంధించి హైదరాబాద్ బాధ్యతలను సురభి, మతీన్, బండారి మహేందర్ ముదిరాజ్‌లకు అప్పగించగా.. రంగారెడ్డి జిల్లాకు అర్చనా సేనాపతి, మహబూబ్ నగర్ జిల్లాకు రంజిత్ గొంగళ్ల ఇన్ ఛార్జీలుగా వ్యవహరిస్తారు. ఇక నల్గొండ జిల్లా బాధ్యతలను సుజిత్, ఖమ్మం జిల్లాకు గట్టు కరుణ, వరంగల్ జిల్లా ఇన్ ఛార్జిగా మాడుగుల రాజిరెడ్డి వ్యవహరించనున్నారు.
జర్నలిజంలో రెండు దశాబ్దాల అనుభవం.. విద్యాభ్యాసంలో గోల్డ్ మెడలిస్ట్!
హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో నిలిచిన ఆకాశ్ కొల్లూరు పక్కా హైదరాబాద్ వాసి. జాతీయ స్థాయిలో దాదాపు రెండు దశాబ్దాలుగా జర్నలిస్టుగా విశేష సేవలందించారు. ఇండియా టుడే, రిపబ్లిక్ టీవీ, సీఎన్ఎన్ న్యూస్ 18, డెయిలీ హంట్ వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
బేగంపేటలోని ప్రసిద్ధ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS)లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆయన, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. విద్యావంతుడు, సమాజంలో మంచి గుర్తింపు ఉన్న సీనియర్ జర్నలిస్ట్‌ను బరిలోకి దించడంతో ఈ ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన పోటీ ఆసక్తికరంగా మారింది.














Click it and Unblock the Notifications
