'భోగాపురం’ కాదు.. విశాఖపట్నం ఎయిర్‌పోర్టే, కీలక మార్పు..!!

భోగాపురం విమానాశ్రయం కేంద్రంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో విమాన ప్రయాణీకులకు అందుబాటులోకి వచ్చిన భోగాపురం లో విమాన సర్వీసుల సంఖ్య పెరుగుతోంది. క్రమేణా ప్రయాణీకుల సంఖ్యలోనూ గణనీయంగా మార్పు వస్తోంది. పలు విమానయాన సంస్థలు ఇక్కడి నుంచి తమ సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇదే సమయంలో భోగాపురం విమానాశ్రయం ఇక నుంచి టికెట్ రిజర్వేషన్ కు విశాఖపట్నం ఏయిర్ పోర్టుగా మారుతోంది.

భోగాపురం విమానాశ్రయం నుంచి రాకపోకలు పెరుగుతున్నాయి. అధునాతన సదుపాయాలతో నిర్మించిన ఈ ఏయిర్ పోర్టుకు ప్రయాణీకుల నుంచి ఆదరణ పెరుగుతోంది. దీంతో, పలు విమాన యాన సంస్థలు పలు ప్రధాన నగరాలకు తమ సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇప్పటికే బ్యాంకాక్, సింగపూర్ కు సర్వీసులు కొనసాగుతున్నాయి. కాగా.. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కోడ్‌ విషయమై కొంత గందరగోళం నెలకొన్నందున దాని పేరును మారుస్తున్నట్టు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్‌ (ఐఏటీఏ) ఓ ప్రకటన జారీచేసింది. ఇప్పటివరకు ఆ విమానాశ్రయ వివరాల్లో వీటీజెడ్‌ కోడ్‌తో భోగాపురం సిటీ అంటూ అనుబంధంగా వ్యవహరిస్తున్నామని పేర్కొంది.

ముగుస్తున్న TTD పాలక మండలి గడువు- కొత్త ఛైర్మన్, సభ్యులుగా వీరికే ఛాన్స్..!?
ముగుస్తున్న TTD పాలక మండలి గడువు- కొత్త ఛైర్మన్, సభ్యులుగా వీరికే ఛాన్స్..!?
iata-to-designate-bhogapuram-airport-as-visakhapatnam-airport-from-november-21-here-the-details

పెరుగుతున్న విమాన సర్వీసులు

తాజా నిర్ణయం లో భాగంగా ఈ ఏడాది నవంబరు 21 నుంచి దాని కోడ్‌ వీటీజెడ్‌గానే ఉంచుతూ సిటీని భోగాపురానికి బదులుగా 'విశాఖపట్నం'గా వ్యవహరిస్తామంది. టికెట్ల వెబ్‌సైట్లలో గందర గోళం లేకుండా ఈ మార్పు చేసినట్టు విమాన ప్రయాణికుల సంఘం తెలిపింది. ఇక తాజాగా ఆర్నాబ్ తుఫాను కారణంగా భోగాపురం నుంచి పలు విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ఇప్పుడు తిరిగి అన్ని సర్వీసులు రెగ్యులర్ అయ్యాయని అధికారులు వెల్లడించారు. అయితే.. విశాఖ నుంచి ఇక్కడకు రావటానికి సమయం పడుతున్న వేళ... ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ప్రయివేటు క్యాబ్ ల ధరల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక.. ఇప్పుడు తాజా మార్పు మేరకు టికెట్ బుకింగ్ చేసుకోవాలని ప్రయాణీకులకు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+