సత్యం.. శివం, సుందరం
హైదరాబాద్: దేశంలోని ఐటి కంపెనీలన్నీ తమ టెకీస్‌కు అమెరికన్ వేషభాషలను నేర్పి అమెరికాకు పంపిస్తుంటే హైదరాబాద్ సంస్థ సత్యం కంప్యూటర్స్ మాత్రం మేమిలాగే వుంటాము, మేమేమిటో మీరే తెలుసుకొండి, అంటూ అమెరికన్లకోసం వినూత్న కార్యక్రమం ప్రవేశపెట్టింది.
పంధ్రాగస్టునాడు కమ్యూనిటీ ఔట్‌రిచ్ ప్రొగ్రామ్ పేరుతో ఈ కొత్త కార్యక్రమాన్ని సత్యం అమెరికాలో ప్రారంభిస్తున్నది. సాధారణంగా ఐటి కంపెనీలు, ఐటి కంపెనీలనే ఏముంది, అమెరికాలో వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించే ఇతర రంగాల్లోని సంస్థలన్నీ కూడా అమెరికన్ క్లయింట్ల కోసం పంపే తమ టెకీలు, మానేజర్లకు అమెరికన్లకు ఇబ్బందికలగకుండా మసులుకునే పద్దతులను నూరిపోసి పంపిస్తుంటారు.
అమెరికా వాతావరణానికి అనుగుణంగా సర్దుబాటు కావడం ఇక్కడ ముఖ్యాంశం. అయితే సత్యం చేపట్టిన కార్యక్రమం కింద మాత్రం అమెరికాలోని సత్యం కంప్యూటర్స్ క్లయింట్లు ఉద్యోగులకు ఇండియన్ ఉద్యోగులతో సర్ధుకుపోవడంపై శిక్షణ ఇస్తారు. ఇండియన్స్ ఆచార వ్యవహారాలు, ఆహారపుటలవాట్లతో పాటు ఈ సందర్భంగా భారత సంస్కృతి, సంప్రదాయాలపై ఈ సందర్భంగా అమెరికన్లకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు.
ఫ్లో విత్ మి, మై ఫ్రెండ్ పేరుతో ప్రముఖ దర్శకుడు మణిశంకర్ దర్శకత్వంతో ఒక కాన్సెప్ట్ ఫిల్మ్‌ను ఇండియా పై తీశారు. న్యూజెర్సీ, చికాగో, అట్లాంటా, డాలస్, డెట్రాయిట్, సాన్‌జోస్, శాంటాక్లారా, వంటి నగరాల్లో క్లయింట్లకు, కమ్యూనిటీకి ఈ ఫిల్మ్‌ను ప్రదర్శిస్తారు. అదే సమయంలో ఇండియన్ నైట్స్ పేరిట సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
సత్యం వ్యాపారంలో 75 శాతం అమెరికానుంచే వస్తున్నది.
సత్యం ఉద్యోగులు 1500 మంది వరకు అమెరికాలోని వివిధ
ప్రాంతాల్లో వున్నారు. అందులో 100 మంది నేరుగా క్లయింట్ల వద్దనే ఆన్‌సైట్ ప్రాజెక్టుల్లో వున్నారు. చాలా మంది అమెరికన్లకు ఇండియన్స్ అలవాట్లు, నడవడి, వింతగా వుంటాయి.
సాంస్కృతికంగా ఉభయుల మధ్య తీవ్ర అంతరం కనిపిస్తుంది. తమ ప్రయత్నం వల్ల ఈ అంతరం కొంతమేర తగ్గినా అమెరికాలో పనిచేసే భారతీయ టెకీలకు ఎంతో ఉపయుక్తంగా వుంటుందని సత్యం వర్గాలు అంటున్నాయి.












Click it and Unblock the Notifications