అత్యాచార నేరంపై హెడ్ కానిస్టేబుల్‌అరెస్టు
ఖమ్మం: ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసిన సంఘటనపైస్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఇ. చిన్నపరెడ్డిని ఖమ్మం జిల్లా భద్రాచలం టైన్ పోలీసులు మంగళవారంఅరెస్టు చేశారు. భద్రాద్రి రాముడిని సందర్శించడానికి వచ్చిన ఒక దళిత కుటుంబానికి చెందిన మైనర్ బాలికను భయపెట్టి తన వెంట తీసుకెళ్లి చిన్నపరెడ్డి అత్యాచారం చేశాడని ఆరోపణ.
బాలికను బలవంతంగా తీసికెళ్లి తనకు కేటాయించిన సత్రం గదిలో చిన్నపరెడ్డి ఆ బాలికపై అత్యాచారం చేశాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. అత్యాచారం జరిగిన సమయంలో ఇరువురి ఒంటిపై వున్న దుస్తులను పరీక్ష నిమిత్తం పంపామని పోలీసులు చెప్పారు. అత్యాచారానికి పాల్పడినట్లు చిన్నపరెడ్డి ఒప్పుకున్నట్లు వారు తెలిపారు.












Click it and Unblock the Notifications