విశాఖలో కోనేరు హంపికి సన్మానం
విశాఖపట్నంః తెలుగుతేజం, భారత్‌చెస్ చరిత్రలో రెండో గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపికి బుధవారంవిశాఖపట్నంలో ఘనసన్మానం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా వారు ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తన ప్రతిభా సామర్థ్యాలతో రాష్ట్రానికి, దేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన హంపికి సన్మానం చేయడం సామాజిక బాధ్యత అని బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు చెప్పారు.
ఈ సందర్భంగా కోనేరు హంపి మాట్లాడుతూ గ్రీస్ లో ఈ నెలలో జరిగే అండర్ 20 వరల్డ్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ లో పాల్గొంటున్నట్లు తెలిపారు. తనకు లభించిన ఈ సత్కారం చిరస్మరణీయమైనదని హంపి అన్నారు.












Click it and Unblock the Notifications