ఉమను పెళ్లాడాలనుకున్నా, కానీ..

వారణాసి: కేంద్ర మంత్రి ఉమాభారతిని గత నెలలో తాను రహస్యంగావివాహం చేసుకున్నట్లు వచ్చిన వార్తల పట్ల బిజెపిసీనియర్‌ నేత, సిద్ధాంత కర్త కె.ఎన్‌. గోవిందాచార్యవిచారం వ్యక్తం చేశారు. కావాలనే కొన్ని స్వార్థ శక్తులు ఈ వదంతులను ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు. తాను ఉమాభారతినివివాహం ఆడినట్లు వచ్చిన వార్తలు తనకెంతో వ్యథను కలుగజేశాయని, ఆమెపై ఈ నీచమైన దాడి జరుగుతున్నందుకు సిగ్గు పడుతున్నానని ఆయన ఆదివారంవిలేకరులతో అన్నారు.

పదేళ్ల కింద ముగిసిన అధ్యాయాన్ని మళ్లీ తెరమీదికి తేవడానికి ఎందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయోఅర్థం కావడం లేదని ఆయన అన్నారు. 1991లో తాను ఉమనుపెళ్లి చేసుకోవాలనుకున్న మాట వాస్తవమేనని, ఈవిషయమై తాను ఒక బిజెపి నేత ద్వారా ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు ఈ ప్రతిపాదన పంపానని ఆయన చెప్పారు. అయితే తన ప్రతిపాదనను ఉమాభారతి తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. అటు తర్వాత ఆమె సన్యాసం తీసుకోవడంతో ఆ కథ ముగిసిందని ఆయన అన్నారు. ఉమను తన రాజకీయ సహచరురాలిగా,స్నేహితురాలిగా ఆయన అభివర్ణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+