గోదావరిలో వరద-33 గ్రామాల ముంపు
హైదరాబాద్: రాష్ట్రంలో గోదావరి ఉప్పొంగుతూనే వుంది. వరద ఉధృతికి ఖమ్మం జిల్లాతలో 33 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దుమ్ముగూడెం మండలంలో అత్యధికంగా 13 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద సూచికను ఎగురవేశారు. భద్రాచలం వద్ద బుదవారం ఉదయం 11 గంటలకు వరద మట్టం 53.5 అడుగులకు చేరుకుంది. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి.
దాదాపు 200 ఇళ్లు ముంపునకు గురయ్యాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటి వరకు అధికారులు లోతట్టు ప్రాంతాల్లోని 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.వీరి కోసం 15 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇంద్రావతి నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో గోదావరి నదిలో వరద ఉధృతి గురువారం ఉదయం వరకు తగ్గవచ్చునని అధికారులు భావిస్తున్నారు.
- ఉప్పొంగుతున్నగోదావరి












Click it and Unblock the Notifications