వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృషి మాజీ చైర్మన్‌ ఆస్తుల జప్తు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కృషి బ్యాంక్‌ మాజీ చైర్మన్‌కె. వేంకటేశ్వరరావు ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్‌ స్కామ్‌కు సంబంధించి కృషి సహకారఅర్బన్‌ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌కు చెందిన కృష్ణా జిల్లాలోని అతని గ్రామంలో గల అధునాతనమైన భవంతిని,విశాఖపట్నం సమీపంలోని పరవాడ వద్ద గల భూమిని పోలీసులుస్వాధీనం చేసుకున్నారు.

వేంకటేశ్వరరావుకు హైదరాబాద్‌, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో గల ఇతర ఆస్తులకు సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారని పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి) హెచ్‌. జె. దొర గురవారం సాయంత్రంవిలేకరులతో చెప్పారు.

కృష్ణా జిల్లా వెంకటప్రగడ గ్రామంలో పది మిలియన్ల ఖరీదు చేసే వేంకటేశ్వరరావు భవంతిని కృష్ణా జిల్లా పోలీసు సూపరింటిండెంట్‌సీల్‌ వేసినట్లు ఆయన తెలిపారు. అక్కడ ఒక గార్డును నియోగించామని, ఈ భవంతి కృషి బ్యాంక్‌ డిపాజిటర్లకు చెందిందనే బ్యానర్‌ను కూడా వేలాడదీశామని ఆయన చెప్పారు.

విశాఖపట్నం జిల్లా పరవాడ వద్ద వేంకటేశ్వరరావు స్థాపించిన మరో కంపెనీ గోల్డ్‌ క్రెస్ట్‌ పవర్‌ లిమిటెడ్‌కు చెందిన 13.47 ఎకరాల భూమిని, భవంతులనువిశాఖపట్నం పోలీసు కమిషనర్‌ స్వాధీనం చేసుకున్నట్లు దొర చెప్పారు.విశాఖపట్నం జిల్లాలోని ఆస్తుల విలువ నాలుగు మిలియన్ల రూపాయలుంటుందని ఆయన అన్నారు.
వేంకటేశ్వరరావుకు హైదరాబాద్‌లో వున్న ఫ్లాట్స్‌ను గుర్తించడానికి సిఐడి, సిసిఎస్‌ బృందాలు రంగంలోకి దిగినట్లు ఆయన తెలిపారు.

వేంకటేశ్వరరావుకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వద్ద 50 ఎకరాల మామిడి తోటతో పాటు తన సొంత గ్రామంలో 70 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు తెలుస్తోందని ఆయన అన్నారు.
కృష్ణా జిల్లా నూజివీడు వద్ద 50 ఎకరాల మామిడితోటను కొని వేంకటేశ్వరరావు ఆ తర్వాతవిక్రయించినట్లు సమాచారం ఉన్నదని ఆయన చెప్పారు. అన్నివివరాలను సేకరిస్తున్నామని, వాటిని గుర్తించిన వెంటనేస్వాధీనం చేసుకుంటామని ఆయన అన్నారు.

కృషి బ్యాంక్‌ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంటామని, వేంకటేశ్వరరావుకే చెందిన హాల్కయెన్‌ సాఫ్ట్‌టెక్‌ లిమిటెడ్‌లోని కంప్యూటర్లను, ఎయిర్‌ కండీషనర్లను, ఇతర గాడ్జెట్స్‌ను పోలీసులుస్వాధీనం చేసుకున్నారని ఆయన చెప్పారు. మూడు ఖరీదైన వేంకటేశ్వరరావు కార్లను పోలీసులుస్వాధీనం చేసుకున్నారని, మరో రెండు కార్ల కోసం అన్వేషిస్తున్నారని ఆయన తెలిపారు.

కృషి బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ వేంకటేశ్వరావును, మరో ఎనమండుగురు డైరెక్టర్లను అరెస్టు చేయడానికి సిఐడి 10 ప్రత్యేక బృందాలను పురమాయించిందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు వేంకటేశ్వరరావు తమ్ముడు, బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌ వేణుగోపాల రావు మాత్రమే పోలీసులకు లొంగిపోయారు. బుధవారం లొంగిపోయిన వేణుగోపాలరావును సిఐడి, సిసిఎస్‌ బృందాలు ఇంటరాగేట్‌ చేశారు. అయితే ఆయన నుంచి అవసరమైన సమాచారాన్ని రాబట్టలేకపోయాయి. తనకు, బ్యాంక్‌ డైరెక్టర్‌ అయిన తన సోదరికి ఇండికా కారు ఇచ్చినట్లు, పేరుకు మాత్రమే తమపేర్లు పెట్టినట్లు, తమకు బ్యాంక్‌ వ్యవహరాల్లో ఏ విధమైన సంబంధం లేనట్లు వేణుగోపాల రావు ఇంటరాగేషన్‌లో చెప్పారు.

వేంకటేశ్వరరావు దేశంలోనే ఎక్కడైనా దాక్కున్నాడా, అమెరికాకు పారిపోయాడా అనే ప్రశ్నకు దొర నేరుగా సమాధానమివ్వలేదు.

కృషి బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ వేంకటేశ్వరరావు వ్యవహారాలతో తన కుమారుడికి ఏ విధమైన సంబంధం లేదని ఆయన అన్నారు. తన కుమారుడు బ్యాంక్‌లో పని చేసిన మాట వాస్తవమేనని, అందుకు రెమ్యునరేషన్‌ కూడా ముట్టలేదని ఆయన అన్నారు. అవకతవకల్లో పాలు పంచుకుంటే తన కుమారుడు నేరం చేసినట్లవుతుందని, అలాంటిదేమీ లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X