కాషాయీకరణ అవాస్తవంః జోషి
హైదరాబాద్‌ఃవిద్య కాషాయీకరణను వ్యతిరేకిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన రోజునే కాషాయీకరణ జరగుతుందనే ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర మంత్రి జోషి హైదరాబాద్ లో అన్నారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి మురళీమనోహర్ జోషి బుధవారం రాత్రి హైదరాబాద్ వచ్చారు. బేగంపేటవిమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూవిద్య కాషాయీకరణ జరుగుతున్నదంటూ ప్రతిపక్షాలు అనవసరంగా రభస చేస్తున్నాయని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కూడా లౌకికవిద్య కోరుకుంటున్నారే తప్ప మరొకటి కాదన్నారు. కాషాయీకరణ జరుగుతున్నదంటూ ప్రతిపక్షాలు ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నాయన్నారు. జాతీయ విద్యావిధానానికి భిన్నంగా ఏదైనా జరిగితే తన దృష్టికి తీసుకు రావలసింది పోయి ఇలా దుష్ప్రచారం చేయడం దురదృష్టకరం అని జోషి అన్నారు.












Click it and Unblock the Notifications