జులైలో శని తిరోగమనం, వచ్చే డిసెంబర్ వరకు వీరికి జాక్ పాట్!

వేద జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. నవ గ్రహాలలో శని భగవానుడిని న్యాయాధికారిగా, ప్రతి ఒక్కరి కర్మలకు తగిన ఫలితాలను ఇచ్చే కర్మఫల ప్రదాతగా భావిస్తారు. మానవ జీవితంలో శని ప్రభావం చాలా బలంగా ఉంటుంది. ఆయన అనుగ్రహం ఉంటే సామాన్యుడు కూడా అపారమైన కీర్తి ప్రతిష్టలను, ఉన్నత స్థానాలను సొంతం చేసుకుంటాడు. అదే శని దేవుడి దృష్టి ప్రతికూలంగా ఉంటే జీవితంలో అనేక ఒడిదొడుకులు, కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

మీనరాశిలో శని తిరోగమనం

ప్రస్తుతం శనిదేవుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. అయితే, రాబోయేకాలంలో ఈ సంచారంలో ఒక కీలక మార్పు చోటు చేసుకోబోతోంది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం, 2026 జూలై 27న మీనరాశిలోనే శనిదేవుడు తిరోగమనం చెందనున్నాడు. తిరిగి 2026 డిసెంబర్ 11వ తేదీ ఉదయం 3:51 గంటల వరకు ఆయన తిరోగమన స్థితిలో సంచరించనున్నారు. ఈ ఐదు నెలల కాలంలో శనిగ్రహ గతిలో వచ్చే మార్పులు కొన్ని రాశులవారికి జాక్ పాట్ అని చెప్పొచ్చు.

lord shani vakri 4 Zodiac Signs To Experience Major Wealth And Success After July 27

వృషభ రాశి

వృషభ రాశి వారికి శని దేవుని తిరోగమన సంచారం అద్భుతమైన ప్రయోజనాలను తీసుకురాబోతోంది. ఈ రాశికి శని దేవుడు తొమ్మిదో ఇల్లు అయిన భాగ్య స్థానానికి, పదో ఇల్లు అయిన కర్మ స్థానానికి అధిపతిగా వ్యవహరిస్తాడు. ఈ తిరోగమన సమయంలో శని వృషభ రాశికి లాభ స్థానమైన పదకొండో ఇంట్లో సంచరిస్తాడు. దీనివల్ల వీరి ఆర్థిక స్థితిగతులలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి శని తిరోగమనం కొత్త ఆశలను చిగురింపజేస్తుంది. ఈ రాశికి శని దేవుడు మూడు, నాలుగు గృహాలకు అధిపతిగా ఉంటాడు. ఈ తిరోగమన కాలంలో శని పంచమ స్థానంలో వక్ర గతిలో సంచరిస్తాడు. దీంతో గత కొంతకాలంగా అనుభవిస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా అంచెలంచెలుగా ఎదిగేందుకు అనుకూలమైన ప్రణాళికలు విజయవంతం అవుతాయి.

మకర రాశి

మకర రాశికి శని దేవుడు అధిపతిగా వ్యవహరిస్తూ, రెండో స్థానానికి కూడా నాయకత్వం వహిస్తాడు. శని తిరోగమన సంచారం మకర రాశికి మూడో ఇల్లు అయిన పరాక్రమ స్థానంలో జరుగుతుంది. దీనివల్ల ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం విపరీతంగా పెరుగుతాయి. ఎటువంటి కఠినమైన సవాళ్లనైనా ఎదుర్కొని నిలబడే శక్తి లభిస్తుంది. మీరు చేసే నిరంతర శ్రమకు తగిన గుర్తింపు, తగిన ప్రతిఫలం లభించే సమయం ఆసన్నమైంది. ఆర్థిక పరమైన విషయాలలో కలిసివస్తుంది.

బుధ, గురు, శుక్రుల కలయిక... జూన్ 23 నుంచి ఈ రాశులవారికి తిరుగులేదిక!
బుధ, గురు, శుక్రుల కలయిక... జూన్ 23 నుంచి ఈ రాశులవారికి తిరుగులేదిక!

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+