దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు- ! నో బ్యాన్.. కానీ 24 గంటలూ..!

ఈ ఏడాది దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా బాణాసంచా (Firecracker) నిషేధం, అనుమతులు ఇచ్చే విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. బాణసంచాపై పూర్తిగా నిషేధం విధిస్తే అది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని, అలాగే నిరంతరాయంగా బాణసంచా కాల్చడానికి కూడా అనుమతించబోమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. బాణసంచాను ఏ సమయాల్లో కాల్చవచ్చో నిర్దేశించడం ద్వారా ఒక మధ్యేమార్గాన్ని కనుగొనాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ పీబీ వరాలేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.

CEC ని తొలగించాల్సిందే-ఇండీ కూటమి తీర్మానం..! డీఎంకే, ఆప్ ట్విస్టులు ..!
CEC ని తొలగించాల్సిందే-ఇండీ కూటమి తీర్మానం..! డీఎంకే, ఆప్ ట్విస్టులు ..!

బాణాసంచా వాడకంపై నిషేధం విషయంలో దాఖలైన పిటిషన్లపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. తాము ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నామని, తాము సంపూర్ణ నిషేధానికి అంగీకరించబోమని, అలాగే రోజుకు 24 గంటల పాటు బాణసంచా కాల్చడానికి కూడా అనుమతించబోమని స్పష్టం చేసింది. సంపూర్ణ నిషేధం ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని, ఇక రోజంతా వాటిని అనుమతించడం వల్ల వృద్ధులు, రోగులు, పిల్లలతో సహా ప్రతి జీవిపైనా తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది. మనం ఒక నిర్దిష్ట సమయాన్ని ఇవ్వగలిగే పరిష్కారాన్ని కనుగొనాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

Supreme Court Declines Blanket Firecracker Ban Says 24-Hour Bursting Not Allowed
సీఈసీతో పాటు టార్గెట్ అవుతున్న సుప్రీం..! ఇద్దరు జడ్జీల వ్యాఖ్యలతో..!
సీఈసీతో పాటు టార్గెట్ అవుతున్న సుప్రీం..! ఇద్దరు జడ్జీల వ్యాఖ్యలతో..!

బాణాసంచాపై నిషేధంపై విచారణ సందర్భంగా.. అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి ఒక నోట్‌ను సమర్పించారు. సీఎస్ఐఆర్-ఎన్ఈఈఆర్ సిఫార్సు చేసిన నిర్దిష్ట తదుపరి తరం జాయిన్డ్ గ్రీన్ క్రాకర్స్ విషయంలో పరిమితమైన, షరతులతో కూడిన సడలింపును పరిగణించవచ్చని ధర్మాసనానికి తెలిపారు. ఈ బాణసంచా వర్తించే శబ్దం, ఉద్గారాలు, భద్రతా అవసరాలకు అనుగుణంగా ఉండాలి, కొన్ని షరతులకు లోబడి ఉండాలని పేర్కొన్నారు. ఈ నిర్దిష్ట బాణసంచాను సరైన లైసెన్స్ ఉన్న తయారీదారులు మాత్రమే తయారు చేస్తే, నిర్దేశించిన 125, 145 డెసిబల్స్ శబ్ద పరిమితికి లోబడి ఉంటే, నిషేధిత రసాయనాలను కలిగి ఉండకపోతే అనుమతించవచ్చని ఆ నోట్‌లో తెలిపారు. దీంతో బాణసంచాలో బేరియం వాడకానికి సంబంధించిన అంశాన్ని అక్టోబర్ 15న పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. గతేడాది దీపావళికి ముందు సంప్రదాయాలను పర్యావరణ, ఆరోగ్య సమస్యలతో సమతుల్యం చేసే లక్ష్యంతో కొన్ని షరతులతో, ఢిల్లీ , జాతీయ రాజధాని ప్రాంతంలో గ్రీన్ బాణసంచా అమ్మకం, వాడకానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.అలాగే దీపావళికి ముందు రోజు, పండుగ రోజున నిర్దిష్ట గంటలకు మాత్రమే గ్రీన్ క్రాకర్ల వాడకం పరిమితం చేస్తామని కోర్టు స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+