కలెక్టరేట్లోనే లంచం తీసుకుంటూ పట్టుబడిన అదనపు కలెక్టర్.. బాణాసంచా కాల్చి రైతుల సంబరాలు
ఆయనో అదనపు కలెక్టర్ .. ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిన అధికారి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాల్సిన బాధ్యతలో ఉన్నవాడు. కింది స్థాయి అధికారులకు మార్గ నిర్దేశం చేయవలసిన వాడు. అటువంటి వాడే తప్పు చేస్తే.. ఎలాంటి భయము లేకుండా ఏకంగా కలెక్టరేట్ కార్యాలయంలోనే అవినీతికి పాల్పడితే.. ఇక ఆ జిల్లాలో కిందిస్థాయి అధికారుల పరిస్థితి ఏమిటి?
రెడ్ హ్యాండెడ్ గా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డిని పట్టుకున్న ఏసీబీ
జిల్లాలో ప్రజా సమస్యల పరిస్థితి ఏమిటి అన్నది అర్థం చేసుకోవాల్సిందే. అయితే అటువంటి అవినీతి అధికారిని రెడ్ హ్యాండెడ్ గా ఏసిబి అధికారులు పట్టుకున్న ఘటన హన్మకొండ జిల్లాలో చోటు చేసుకుంది. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ గా పని చేసిన వెంకటరెడ్డి తీరు మొదటినుండి వివాదాస్పదమే. పదేళ్ల క్రితం ఏసీబీ దాడులలో పట్టుబడిన ఆయన అప్పట్లో జైలుకు కూడా వెళ్ళి వచ్చారు.

వివాదాస్పద అధికారిగా ముద్ర
ప్రస్తుతం హన్మకొండ అదనపు కలెక్టర్ గా ఉన్న ఆయన వివాదాస్పద స్థలాల కేసుల్లో అధికార పార్టీ నేతలతో కలిసి డబ్బులు దండుకుంటూ అక్రమార్కులకు అనుకూలంగా ఆర్డర్లను ఇస్తున్నట్టు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. తాజాగా హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్, జిల్లా ఇన్చార్జి విద్యా శాఖ అధికారిగా పనిచేస్తున్న వెంకట్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.
బాధితుడి సమాచారంతో ఏసీబీ ట్రాప్
కలెక్టరేట్ కార్యాలయంలోని ఆయన చాంబర్లో 60వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇంచార్జ్ విద్యాశాఖ అధికారిగా ఆయన ఒక స్కూల్ రెన్యువల్ కోసం లక్ష రూపాయలు డిమాండ్ చేసినట్టు బాధితుడు ఇచ్చిన సమాచారం మేరకు, బాధితుడు డబ్బులు ఇస్తున్న క్రమంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.
అవినీతి చేస్తూ అధికారి పట్టుబడటంతో సంబరాలు
ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచాలు అడిగితే ఏసీబీకి సమాచారం అందించాలని ఆయన సూచించారు. అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి తో పాటు సిబ్బంది గౌస్, మనోజ్ ను కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. అయితే ఏసీబీ రైడ్స్ లో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి పట్టుబడడంతో జిల్లాలోని పలు ప్రాంతాలలో రైతులు సంబరాలు జరుపుకుంటున్నారు.

బాణా సంచా కాల్చి సంబరాలు చేసుకున్న గ్రీన్ ఫీల్డ్ హైవే బాధిత రైతులు
ముఖ్యంగా గ్రీన్ఫీల్డ్ హైవే బాధిత రైతులు ఆయన తీరుతో తాము నష్టపోయినట్టు, భూసేకరణలో వివాదాలు ఉన్న భూముల విషయంలో లంచాలు తీసుకుని, తమకు అన్యాయం చేసినట్టు కొందరు చెబుతున్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే బాధిత రైతులు తమ ఉసురే ఆయనకు తాకిందని, అందుకే ఏసీబీ రైడ్స్ లో పట్టుబడ్డాడని బ్యానర్లతో సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చారు. ఇటువంటి అవినీతి అధికారులను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేశారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications