రేవంత్ సిరిసిల్ల పర్యటన వేళ హరీష్ కీలక వ్యాఖ్యలు..!!
హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి రేవంత్ సిరిసిల్ల పర్యటన వేళ రాజకీయం ఆసక్తి గా మారుతోంది. పలు కార్యక్రమాల్లో రేవంత్ పాల్గొంటున్నారు. ఈ పర్యటన పైన బీఆర్ఎస్ - కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీష్ రావు ఆసక్తి కర విశ్లేషణ చేసారు. ముఖ్యమంత్రి రేవంత్ సిరిసిల్ల పర్యటన వేళ చోటు చేసుకుంటున్న పరిణామాలను ప్రశ్నించారు. రేవంత్ కు కీలక సూచనలు చేసారు.
సీఎం రేవంత్ సిరిసిల్ల పర్యటన పైన హరీష్ కీలక వ్యాఖ్యలు చేసారు. రేవంత్ సిరిసిల్ల పర్యటన వేళ ఇంత మందిని ఎందుకు అరెస్ట్ చేసారని ప్రశ్నించారు. బీఫోర్ కేటీఆర్.. ఆఫ్టర్ కేటీఆర్ ఏందో ఒక్కసారి సిరిసిల్ల ప్రజలను అడగండి వాళ్లు చెప్తారని హరీశ్ హితవు పలికారు. ఎంత ఆదర్శంగా.. ఎంత అద్భుతంగా సిరిసిల్ల తయారైందో.. కేటీఆర్ రాకముందు సిరిసిల్ల ఎట్లుంటే.. కేటీఆర్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎట్లా మారిందో ఆ సిరిసిల్ల ప్రజలను అడుగు.. వాళ్లు చెప్తరని రేవంత్ కి సూచించారు.

గూండాలనో, కార్యకర్తలనో, సివిల్ డ్రెస్‌లో పోలీసోళ్లను పెట్టుకొని పోయినంత మాత్రాన సిరిసిల్ల ప్రజల తలరాతలు మారవన్నారు. సిరిసిల్ల ఆదర్శనియోజకవర్గం అయిందంటే.. అక్కడున్నరైతులకు కాళేశ్వరం జలాలు వచ్చినయంటే.. మానేరు మీద చెక్‌డ్యామ్‌లు వచ్చినయంటే..సిరిసిల్ల మున్సిపాలిటీ ఆదర్శంగా అభివృద్ధి జరిగిందంటే.. దాని వెనుక కేటీఆర్ కృషి ఉందని హరీష్ చెప్పుకొచ్చారు.
సీఎం రేవంత్ ప్రజల మనసు గెలవాలంటే మేం పని చేసినదానికంటే ఎక్కువ పని చేయాలని వ్యాఖ్యానించారు. ఎక్కువ పథకాలు ఇవ్వాలని.. ఎక్కువ డబ్బులు ఇచ్చి ప్రజల మనసు గెలవాలి కానీ.. పోలీసోళ్లనో, గూండాలనో పెట్టుకొని దండయాత్ర చేస్తానంటే సాధ్యం కాదని పేర్కొన్నారు. రేవంత్...సిరిసిల్లలో నేర్చుకొని రా.. చేనేత కార్మికులకు కేసీఆర్, కేటీఆర్ ఏం చేశారో..? ఆ వరుస చెక్‌డ్యామ్‌లు కడితే ఆ మానేరు పరిసర ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో అద్భుతమైన పంటలు ఎట్లా పండినయో... చూసి నేర్చుకోవాలని రేవంత్ కు హరీష్ సూచించారు. కాగా.. సిరిసిల్ల లో సీఎం రేవంత్ పర్యటన మొదలైంది. కలెక్టరేట్ ను ప్రారంభించటంతో పాటుగా పలు కార్యక్రమాల్లో రేవంత్ పాల్గొంటున్నారు. ఇక.. ఇక్కడ రేవంత్ చేసే ప్రసంగం పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది.














Click it and Unblock the Notifications
