Aadarsha Kutumbam: వెంకీ 'ఆదర్శ కుటుంబం' స్టోరీ ఇదే.. ఒక్క ముక్కలో తేల్చేసిన త్రివిక్రమ్
విక్టరీ వెంకటేశ్- త్రివిక్రమ్ అనగానే మనకు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలు గుర్తుకొస్తాయి. ఈ మూవీస్ లో త్రివిక్రమ్ డైలాగ్స్ ఇప్పటికీ మనకు గుర్తుకొస్తుంటాయి. రీల్స్, మీమ్స్ లో వైరల్ అవుతుంటాయి. అయితే చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ వెంకీ- త్రివిక్రమ్ క్రేజీ కాంబో 'ఆదర్శ కుటుంబం' అనే సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అక్టోబర్ 9 న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఇటీవల ప్రొమోషన్స్ ను స్టార్ట్ చేసింది.
తాజాగా ఈ మూవీ నుంచి రిలీజైన నారాయణమ్మ సాంగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. తమన్ మ్యూజిక్ అద్దిరిపోయింది. అంతకుముందు రిలీజ్ అయిన టీజర్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా తర్వాత త్రివిక్రమ్.. అనిల్ రావిపూడితో సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వెంకీ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఇక తాజాగా ప్రముఖ యాంకర్ సుమతో చిత్ర యూనిట్ ఇంటర్వ్యూ జరిగింది. వెంకటేశ్, త్రివిక్రమ్, శ్రీనిధి శెట్టి ఇందులో పాల్గొన్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ మాట్లాడుతూ సినిమా స్టోరీ చెప్పేశారు. 'ఆదర్శకుటుంబం' కథను ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదే అని తేల్చేశారు. దాంతో ఆయన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కథలో చాలా లేయర్స్ ఉన్నట్లు త్రివిక్రమ్ హింట్ ఇచ్చారు. ఈ మేరకు మాట్లాడుతూ.. " ఆదర్శ కుటుంబం స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాలి అంటే రెండు వర్గాలు లేదా దేశాల మధ్య మధ్య గొడవలు జరుగుతుంటే మధ్యలోని వాళ్లు కూడా ఎఫెక్ట్ అవుతుంటారు. ఉదాహరణకు రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే ఆ రెండు దేశాల యుద్ధంగానే అందరూ గుర్తిస్తారు కానీ ఆ రెండు దేశాల ప్రజల గురించి ఎవరూ పట్టించుకోరు. అలా కాకుండా సమస్యని రెండు వర్గాల మధ్యలో ఉన్న వారి కోణం.. రెండు దేశాల ప్రజల కోణం నుంచి చూస్తే ఎలా ఉంటుంది అనే అంశంతో ఆదర్శ కుటుంబం కథ ఉంటుంది.. అని తెలిపారు. త్రివిక్రమ్ కామెంట్స్ తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఇక అక్టోబర్ 9 న వెంకీ- త్రివిక్రమ్ మ్యాజిక్ స్క్రీన్ పై ఎలా ఉంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications
