బుధ, గురు, శుక్రుల కలయిక... జూన్ 23 నుంచి ఈ రాశులవారికి తిరుగులేదిక!

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాల కదలికలు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇటీవలి కాలంలో అత్యంత అరుదైన ఒక శుభ సంఘటన జరగనుంది. జూన్ 23 నుంచి జూలై 4 వరకు కర్కాటక రాశిలో గురుడు ఉచ్ఛస్థితిలో ఉండగా, బుధుడు మరియు శుక్రుడు కలిసి సంచరిస్తారు. ఈ మూడు సహజ శుభ గ్రహాల అపూర్వ కలయిక జ్యోతిష్య నిపుణులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఇలాంటి యోగం దీర్ఘకాలం తర్వాత ఏర్పడుతోంది.

గురు, బుధ, శుక్ర గ్రహాల సంయోగం

ఈ త్రిగ్రహ సంయోగం మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు తెలిపారు. రాజయోగం, ధనయోగం, ఉన్నత స్థానాలు, ఆర్థిక అభివృద్ధి, వృత్తి పురోగతి వంటి శుభ ఫలితాలు ఈ రాశుల వారికి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురువు ఉచ్ఛస్థితి వల్ల జ్ఞానం, ధర్మం, సంపద పెరుగుతాయి. బుధుడు తీక్షణ బుద్ధిని, వాణిజ్య లాభాలను, శుక్రుడు సుఖాలు, ఆర్థిక సమృద్ధిని అందిస్తాడు.

mercury jupiter venus conjunction Massive Wealth Boost For These 6 Zodiac Signs Starting June 23

మేష రాశి: చతుర్థ స్థానంలో ఈ గ్రహాల అనుకూలత వల్ల ఆర్థిక స్థిరత్వం, ఉద్యోగోన్నతి సాధ్యమవుతాయి. కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. పెండింగ్ సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది.

మిథున రాశి: ధన స్థానంలో గ్రహ యుతి వల్ల ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో లాభాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా ముగుస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. మిధునరాశి జాతకులకు ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇది మిధునరాశి వారికి అన్ని విధాలా లబ్ది చేకూరుస్తుంది.

కర్కాటక రాశి: గురువు స్వయంగా ఈ రాశిలో ఉచ్ఛస్థితిలో ఉండటం వల్ల అత్యంత శుభం. ఆదాయ వృద్ధి, జీతం పెరుగుదల, షేర్ మార్కెట్ లాభాలు, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ సమయం కర్కాటక రాశి జాతకులకు తిరులేనిది. ఈ సమయంలో అన్ని విషయాల్లో లబ్ది జరుగుతుంది.

కన్య రాశి: లాభ స్థానంలో ఈ యోగం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. కన్యా రాశి జాతకుల వ్యాపార విస్తరణ జరుగుతుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. మనసులోని కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ఇది కన్యా రాశి జాతకులకు శుభాలు చేకూర్చే సమయం.

జూన్ 22 నుంచి ఈ రాశులకు తిరుగులేదన్న లక్ష్మీ నారాయణ రాజయోగం!
జూన్ 22 నుంచి ఈ రాశులకు తిరుగులేదన్న లక్ష్మీ నారాయణ రాజయోగం!

తుల రాశి: దశమ స్థానంలో గ్రహాల ప్రభావం వల్ల వృత్తిలో ఉన్నత స్థానాలు, శుభవార్తలు వినే అవకాశం ఉంది. పెళ్లి లేదా ఉద్యోగ సంబంధిత మంచి వార్తలు వస్తాయి. పెట్టుబడులు లాభదాయకం అవుతాయి. ఇది తులా రాశి జాతకులకు అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉంటుంది.

మకర రాశి: సప్తమ స్థానంలో ఈ సంయోగం రాజయోగం, ధనయోగాలను తెస్తుంది. పదోన్నతులు, కొత్త పరిచయాలు, ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతాయి.ఈ కాలంలో అన్ని రాశుల వారు శుభకార్యాలు, కొత్త ప్రయత్నాలు చేపట్టడం మంచిది.

జ్యోతిష్యం మార్గదర్శకం మాత్రమేనని, వ్యక్తిగత కృషి, కర్మ అత్యంత ముఖ్యమని నిపుణులు గుర్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+