యుద్ధం మొదలైంది, మహిళలతో కొట్టిస్తాం- కొండా సురేఖ ఘాటు హెచ్చరిక..!!

మాజీ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేసారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన తరువాత తాము కాంగ్రెస్ లోనే కొనసాగుతామని ప్రకటించిన సురేఖ.. వరుసగా తమ మద్దతు దారు లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పైన మంత్రాంగం నడుపుతున్నారు. ఇదే సమయంలో తమను విమర్శించే వారు నోరు అదుపులో పెట్టుకోవాలని.. మహిళలతో కొట్టిస్తామని హెచ్చరించారు. ప్రతిపక్ష నేతల పైనా మండిపడ్డారు.

కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసారు. మంత్రి పదవి పోవటం తనకు బాధగా లేదని చెప్పారు. మంత్రిగా ఉంటే రాష్ట్ర స్థాయిలో సేవ చేసే అవకాశం తనకు ఉండేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వరంగల్ నియోజకవర్గంపై దృష్టి సారించి అభివృద్ధి చేసే అవకాశం తనకు వచ్చిందని కొండా సురేఖ వెల్లడించారు. ఇకపై నియోజకవర్గంలో అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు . వచ్చే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలవడమే తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలంతా వర్గ విభేదాలను పక్కన పెట్టి పార్టీ కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. కొందరు నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇష్టానుసారం మాట్లాడితే మహిళలతో చిత్తుచిత్తుగా కొట్టిస్తామని సురేఖ వార్నింగ్ ఇచ్చారు.

ఖైరతాబాద్ బరిలో జనసేన నుంచి ప్రముఖ సినీ నటుడు..? పవన్ బిగ్ స్కెచ్..!!
ఖైరతాబాద్ బరిలో జనసేన నుంచి ప్రముఖ సినీ నటుడు..? పవన్ బిగ్ స్కెచ్..!!
konda-surekha-made-key-announcement-over-her-future-political-action-plan-in-warangal-dist-here-the

కొండా సురేఖ తాజా వ్యాఖ్యలతో

ఒక్కో మహిళ నలుగురిని కొడుతుంది జాగ్రత్త.. అంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తమ అనుచరులపై ఈగవాలిన ఊరుకోబోమని హెచ్చరించారు. మొన్న ఎంజీఎం దగ్గర బీఆర్ఎస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారని ధ్వజమెత్తారు. వాళ్లు వాళ్లే తోసేసుకుని పోలీసులు కొట్టారని ఆస్పత్రిలో జాయిన్ అయ్యారని కొండా సురేఖ విమర్శించారు. కొత్త కలెక్టరేట్ దగ్గర బీజేపీ నాయకులు నిరసన తెలిపి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. వరంగల్ అభివృద్ధిపై బీజేపీ నాయకులకు సవాల్ చేశారు. వరంగల్‌లో పురాతన ప్రదేశాలను అభివృద్ధి చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి.. అప్పుడు మాట్లాడాలని కొండా సురేఖ ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కొత్త డిబేట్ కు కారణంగా నిలుస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+