SIRతో 13 కోట్ల మంది ఔట్-విపక్షాలు ఎన్నికలు బహిష్కరించాలి-మాజీ హోం కార్యదర్శి లేఖ..!
కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (SIR)లో చోటు చేసుకుంటున్న నిబంధనల ఉల్లంఘనలపై మాజీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ ఆర్‌కే సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎస్ఐఆర్ లో చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆయన దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం
ఓటర్ల జాబితా సవరణ, ఓటర్ల పేర్ల తొలగింపు ప్రక్రియలో నిబంధనలు పాటించలేదని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ చేపట్టే నిర్ణయం చట్టబద్ధమైనదేనా? ఈ నిర్ణయం మొత్తం ఎన్నికల కమిషన్ తీసుకుందా? లేక సీఈసీ జ్ఞానేశ్ కుమార్ మాత్రమే తీసుకున్నారా? అని ఆర్కే సింగ్ ప్రశ్నించారు.
ఓటర్ల పేర్ల తొలగింపుపై (SIR)
ఈఆర్వోల ద్వారా 2003 తర్వాత ఓటర్ల జాబితాలో చేర్చిన పేర్లను ఎలాంటి సరైన విచారణ, ఆధారం లేదా షోకాజ్ నోటీసు లేకుండా తొలగించారని ఆర్‌కే సింగ్ ఆరోపించారు. పేర్లు తొలగించిన తర్వాత సంబంధిత వ్యక్తులు మళ్లీ ఫామ్ 6 ద్వారా కొత్త ఓటర్లుగా దరఖాస్తు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇది గతంలో సుప్రీంకోర్టు లాల్ బాబూ మరియు ఇతరులు వర్సెస్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు ఇతరుల కేసులో 1995లో ఇచ్చిన తీర్పుకు విరుద్దమన్నారు. ఇప్పటికే ఓటరుగా నమోదైన వ్యక్తి అనర్హుడని నిరూపించాల్సిన బాధ్యత ఓటరుపై కాకుండా, అభ్యంతరం తెలిపిన వ్యక్తి లేదా విచారణ అధికారిపైనే ఉండాలన్నారు. ఇద్దరు కమిషనర్లు వ్యతిరేకించినా సీఈసీ.. ఫామ్ 6కు అదనపు పత్రాల్ని జోడించడాన్నీ తప్పుబట్టారు. 2003 ఓటర్ల జాబితాలో తల్లిదండ్రుల పేర్ల సీరియల్ నంబర్‌ను దరఖాస్తుదారులు ఇవ్వాల్సి రావడం వల్ల ముఖ్యంగా యువ ఓటర్ల నమోదుపై ప్రభావం చూపిందన్నారు.
















Click it and Unblock the Notifications
