భగ్గుమంటున్న సిమెంట్ ధరలు.. అక్టోబర్‌లో మరోసారి పెరిగే ఛాన్స్!

ఇల్లు కట్టుకోవాలనుకునే మధ్యతరగతి ప్రజలకు, రియల్ ఎస్టేట్ రంగానికి రాబోయే రోజులు మరింత భారంగా మారేలా కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా కాస్త స్థిరంగా ఉన్న సిమెంట్ ధరలు ఇప్పుడు మళ్లీ భగ్గుమంటున్నాయి. జూలై, ఆగస్టు నెలల్లో ఎలాంటి పెద్ద మార్పులు లేకుండా ఉన్న సిమెంట్ ధరలు, సెప్టెంబర్ నెల వచ్చేసరికి ఒక్కసారిగా పైకి కదిలాయి. దేశవ్యాప్తంగా సగటున బస్తాకు రూ.7 చొప్పున ధర పెరగడంతో ప్రస్తుతం సగటు ట్రేడ్ ధర రూ.356కి చేరుకుంది. కొనుగోలుదారులపై ఈ భారం క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

సెప్టెంబర్‌లో దక్కిన ఊపుతో సిమెంట్ కంపెనీలు మరింత ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. అక్టోబర్ నెలలో మార్కెట్ పరిస్థితిని బట్టి మరోసారి బస్తాకు రూ.5 నుంచి రూ.20 వరకు ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ పెంపు ఎంతవరకు నిలకడగా ఉంటుందనేది పూర్తిగా మార్కెట్‌లో డిమాండ్ పుంజుకోవడం మరియు డీలర్ల స్పందనపైనే ఆధారపడి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Cement Prices Rise by Rs 7 Per Bag in September With Further Hikes Expected Across Markets in October

పెరిగిన ఇంధన ధరల ప్రభావం

సిమెంట్ తయారీలో కీలకమైన ఇంధన ధరలు ఇటీవలి వారాల్లో తీవ్రంగా పెరగడమే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణమని తెలుస్తోంది. తయారీ ఖర్చులు విపరీతంగా పెరుగుతుండటంతో ఆ భారాన్ని కంపెనీలు వినియోగదారులపై మోపుతున్నాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో కంపెనీలు ధరలు పెంచినప్పటికీ, క్వార్టర్ ముగింపు లక్ష్యాలను చేరుకోవడానికి డీలర్లు పాత ధరలకే విక్రయాలు జరపడంతో ఆ ప్రభావం ఇంకా పూర్తిస్థాయిలో కస్టమర్లకు చేరలేదని సమాచారం.

సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?

దక్షిణాదిలో అత్యధికంగా పెరిగిన వైనం

ప్రాంతాల వారీగా పరిశీలిస్తే సెప్టెంబర్‌లో సిమెంట్ ధరల పెరుగుదల అన్ని చోట్లా ఒకేలా లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో ధరల బాదుడు గట్టిగానే పడింది. ఇక్కడ ఒక్కో బస్తాపై సగటున రూ.11 వరకు ధర పెరిగింది. తర్వాతి స్థానంలో పశ్చిమ భారతదేశంలో రూ.9 మేర ధరలు పెరగ్గా.. సెంట్రల్, తూర్పు, ఉత్తర భారతదేశంలో మాత్రం బస్తాకు రూ.5 చొప్పున ధరలు పెరిగినట్లు నిపుణులు వెల్లడించారు.

లోన్లు తీసుకున్న వారికి బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న వడ్డీ!
లోన్లు తీసుకున్న వారికి బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న వడ్డీ!

రాబోయే రోజుల్లో మార్కెట్ తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయి?

సెప్టెంబర్‌లో ధరలు కాస్త కోలుకున్నప్పటికీ, ఈ క్వార్టర్ మొత్తంగా చూస్తే ధరలు స్వల్పంగానే తగ్గాయని చెప్పాలి. రుతుపవనాల ప్రభావం, వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో నిర్మాణ పనులకు అడ్డంకులు ఏర్పడినప్పటికీ, డిమాండ్ పూర్తిగా పడిపోలేదు. అక్టోబర్‌లో కంపెనీలు తలపెట్టిన కొత్త ధరల పెంపు విజయవంతం కావాలంటే మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్ ఊపందుకోవడం ఎంతో కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+