కేటీఆర్ అక్రమాల చిట్టా చెప్పి.. నాతో పెట్టుకోకు అంటూ కవిత తీవ్ర హెచ్చరిక!
టీఆర్ఎస్ అధినేత్రి కవిత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేశారు. ఎమ్మెల్యేలకే పెత్తనం ఇవ్వటం కేసీఆర్ తప్పుడు నిర్ణయం అని, నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సీఎం అని చెప్పి, నియోజకవర్గాల్లో వేలు పెట్టొద్దు అని కేసీఆర్ చెప్పటంతో సమస్యలు తమ దాకా రాలేదని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు కవిత కౌంటర్ ఇచ్చారు.
నేను మీ పార్టీలో ఒక్క అవినీతి గుంటనక్కను విమర్శిస్తేనే.. కొన్ని గంటల్లో పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు. అదే గుంటనక్కతో అంటకాగుతూ మీ పార్టీ అధినేత తీరుతోనే నష్టపోయామని మీరు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం పార్టీ వ్యతిరేకం కాదా? అని కవిత సూటి ప్రశ్న వేశారు.

మీరు మీ పార్టీ అధినేత KCR ను విమర్శించడం.. ఆయన తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలను బాహాటంగా తప్పు పట్టడం పార్టీ వ్యతిరేక చర్య కాదా!? అని నిలదీశారు. మీ ఫామ్ హౌస్ లు, అక్రమంగా ఇచ్చిన పర్మిషన్లు.. ఆంధ్రా దోస్తులకు ఇచ్చిన నజరానాలు.. క్విడ్ ప్రో కో దందాలతో మీ పార్టీని పాతాళంలోకి నెట్టింది మీరు కాదా? అంటూ కవిత సంచలన ఆరోపణలు చేశారు.
నిన్నటి బీఆర్ఎస్ మీటింగులో ఓ రైతు ఫోన్ మాట్లాడుతుంటే "నీ పెండ్లామా!? అంత అర్జెంటా!? అని అహంకారంతో అతని భార్యనే అవమానించారు. ఒక మహిళ సాయం కోరి వస్తే నా కోసం కన్నావా అని అమ్మనే అవమానించారు. గుంటనక్క మైండ్ గేమ్ లో బ్లైండ్ గా పడిపోయి పెద్ద మనిషినే తప్పు బడుతున్నావ్.. బీఆర్ఎస్ కు గోతిని తవ్వుతున్నావ్ అని కేటీఆర్ ను కవిత టార్గెట్ చేశారు.
కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టు.. పార్టీలో మీ వైఫల్యాన్ని.. మీ చేతగాని తనాన్ని బీఆర్ఎస్ అధినేతపై మోపుతున్నావు అంటే... ప్రత్యక్ష రాజకీయాల్లో మీ స్థానం ఏమిటో అర్థమవుతుందా? అంటూ కవిత ప్రశ్నించారు. నిమజ్జనోత్సవంలో ఎంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ను బతిమాలుకున్నారో ఆ గణేష్ మహారాజుకు, మీ అంతరాత్మకు తెలుసు అంటూ వ్యాఖ్యలు చేశారు.నేను నీలాగా విష నాగుల మాటలు విని మాట్లాడను.. నిర్ధిష్టమైన ఆధారాలతోనే మాట్లాడుతాను.. నాతో పెట్టుకోకు అంటూ కవిత హెచ్చరించారు.












Click it and Unblock the Notifications
