ఖైరతాబాద్ బరిలో జనసేన నుంచి ప్రముఖ సినీ నటుడు..? పవన్ బిగ్ స్కెచ్..!!

తెలంగాణ రాజకీయం ఆసక్తిగా మారుతోంది. ఖైరతాబాద్ ఉప ఎన్నిక కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలకు ఈ బై పోల్ సెమీస్ గా మారుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ అభ్యర్ధుల పైన దాదాపుగా స్పష్టత వచ్చింది. ఇక.. ఇప్పుడు జనసేన సైతం ఖైరతాబాద్ బరిలో నిలవాలని డిసైడ్ అయింది. అటు కవిత పార్టీ తాము పోటీ చేస్తున్నట్లు వెల్లడించింది. తమ పార్టీ నుంచి ప్రముఖ సినీ నటుడిని దింపేందుకు పవన్ వ్యూహ రచన చేస్తు న్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

దానం నాగేందర్ పైన అనర్హత వేటుతో ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయమైంది. ఇప్పటికే అసెంబ్లీ సీటు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్ సైతం జారీ అయింది. ఈ ఎన్నికలో పోటీకి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు తమ వ్యూహాలను సిద్దం చేస్తున్నాయి. మూడు పార్టీల అభ్యర్ధుల పైనా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. అదే విధంగా కవిత సైతం తాము బై పోల్ లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఇక.. జనసేన సైతం ఖైరతాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని డిసైడ్ అయింది. గ్రేటర్ ఎన్నికల వేళ జరుగుతున్న ఉప ఎన్నిక కావటంతో ఈ పోరు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. ఈ ఎన్నికల్లో జనసేన నుంచి పవన్ తో అత్యంత సన్నిహితంగా ఉండే ఒక ప్రముఖ సినీ నటుడిని బరిలోకి దింపే అవకాశం ఉందని పార్టీ నేతల సమాచారం. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటర్లు... సమీకరణాలకు తమకు అనుకూలంగా ఉంటాయని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్దులు ఖరారు..!?
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్దులు ఖరారు..!?
janasena-eyes-senior-film-actor-for-khairatabad-bypoll-pawan-kalyan-to-announce-soon-here-the-repo

పవన్ తాజా నిర్ణయం తో

తెలంగాణలో తమకు ఎవరితో పొత్తులు ఉండవని ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. దీంతో, బీజేపీతో సంబంధం లేకుండా స్వీయ బలంతోనే ఖైరతాబాద్‌లో తమ అభ్యర్ధిని నిలబెట్టాలని జనసేన నిర్ణయించినట్లు కనిపిస్తోంది. పొత్తుల వైపు చూడకుండా ఒంటరిగానే బరిలోకి దిగి జనసేన ఓటు బ్యాంక్ ఏంటో నిరూపించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ఇప్పటికే పవన్ స్పష్టత ఇచ్చారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధిని పవన్ ప్రకటించారు. కాగా.. ఇప్పుడు ఖైరతాబాద్ లోనూ పోటీ చేయటం ద్వారా హైదరాబాద్ పరిధిలో తమ బలం పెంచుకోవటానికి.. కేడర్ లో జోష్ పెంచేందుకు సహకరిస్తుందని అంచనా వేస్తున్నారు. సినీ రంగానికి చెందిన వ్యక్తిని పోటీకి దింపాలనే నిర్ణయం ఇప్పుడు ఖైరతాబాద్ బై పోల్ వేళ రాజకీయం మరింత ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+