మంచు యుగం నాటి ఊల్ మమ్మూత్ మళ్లీ సాక్షాత్కారం: ఆసియన్ ఏనుగులపై ప్రయోగాలు

కొన్ని వేల సంవత్సరాల కిందట శీతల ప్రాంతాలలో సంచరిస్తూ, కాలక్రమేణా భూమిపై నుంచి కనుమరుగై పోయిన భారీ మముత్ (ఊలు ఏనుగులు) మళ్లీ మన కళ్ల ముందుకు రాబోతున్నాయా? అనే ప్రశ్నకు అవుననే అంటున్నాయి శాస్త్ర పరిశోధనలు. డిజిటల్ యుగంలో బయోటెక్నాలజీలో వస్తున్న మార్పుల నేపథ్యంలో మంచు యుగం నాటి మహా జీవులను తిరిగి సృష్టించే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అత్యాధునిక జీన్ ఎడిటింగ్ టెక్నాలజీని ఉపయోగించి శాస్త్రవేత్తలు ఈ అసాధారణ అద్భుతాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తోన్నారు. కొలోసల్ బయోసైన్సెస్ అనే సంస్థ ఈ భారీ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రయోగం ద్వారా ఆసియా ఏనుగుల శరీరంలో కొన్ని జన్యు మార్పులు చేయడం ద్వారా మముత్ తరహా జీవులను సృష్టించాలని శాస్త్రవేత్తలు ప్రణాళికలు రూపొందించారు.

Ice Age woolly mammoth back from extinction by the Scientists Northern Hemisphere surviving freezing conditions

గడ్డకట్టించే అతిమంచు వాతావరణం, అత్యంత క్లిష్టపరిస్థితులను తట్టుకుని నిలబడేలా ఆసియా ఏనుగులను మార్చడం వెనుక పర్యావరణ కారణాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఆర్కిటిక్ వంటి అతి శీతల ప్రాంతాల పర్యావరణ వ్యవస్థను సమతుల్యం చేయడంలో ఈ మముత్‌లు కీలక పాత్ర పోషించేవి. ఇప్పుడు కూడా అటువంటి వాతావరణాన్ని తట్టుకునే ఏనుగులను అలవాటు చేసి, ఆర్కటిక్ ఖండంలో వదిలిపెట్టడం ద్వారా అక్కడి పర్యావరణాన్ని మళ్లీ గాడిన పెట్టవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

ఇది అంతరించిపోతున్న ఇతర జీవుల రక్షణకు ఓ నూతన మార్గం చూపుతుందని ఆశిస్తున్నారు. ఈ జీవుల పునరుజ్జీవన ప్రక్రియలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అత్యంత కీలకంగా మారనుంది. మంచు ఫలకాల కింద చెక్కుచెదరని విధంగా దొరికిన పురాతన మముత్ శరీర అవశేషాల నుంచి డీఎన్ఏను సేకరించారు. ఆ డీఎన్ఏ, ప్రస్తుతం జీవించి ఉన్న ఆసియా ఏనుగుల డీఎన్ఏతో పోల్చి పరిశోధించడానికి ఏఐని వాడుతున్నారు.

Ice Age woolly mammoth back from extinction by the Scientists Northern Hemisphere surviving freezing conditions

ఏయే జన్యువుల వల్ల మముత్‌కు మందపాటి చర్మం, తీవ్రమైన చలిని తట్టుకునే హార్మోన్ల వ్యవస్థ ఏర్పడ్డాయో గుర్తించడంలో ఈ ఏఐ కంప్యూటేషనల్ టూల్స్ సహాయపడుతున్నాయి. జన్యు గుర్తింపు పూర్తి కాగానే పని ముగిసినట్టు కాదు. అతి శీతల పరిస్థితులను తట్టుకోవడానికి వీలుగా ఆసియా ఏనుగు గర్భకణాలలో సైతం ఈ మార్పులు చేయాల్సి ఉంటుంది. దీనికోసం క్రిస్పర్ వంటి అత్యాధునిక జన్యు సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇది నిర్దుష్ట డీఎన్ఏ భాగాలను మార్చడానికి దోహదపడుతుంది.

మొదట్లో ఈ ప్రాజెక్టును 2028 నాటికే పూర్తిచేయాలని కొలోసల్ సంస్థ భావించింది. పరిశోధనలు ముందుకు సాగుతున్న కొద్దీ అనేక సాంకేతిక, శాస్త్రీయ అడ్డంకులు తెరపైకి వచ్చాయి. దీంతో ఈ కాలపరిమితిని 2030వ దశకానికి మార్చారు. పిండంవృద్ధి రేటు సరిగ్గా లేకపోవడం, ప్రయోగశాలలో మార్పిడి చేసిన కణాలు ఆరోగ్యకరంగా మారడంలో ఇబ్బందులు ఎదురుకావడం వంటి అంశాలు గడువు పెరగడానికి కారణం అయ్యాయి.

ఏనుగులలో సహజంగానే గర్భధారణ కాలం దాదాపు 22 నెలల వరకు ఉంటుంది. దీనివల్ల ప్రయోగ ఫలితాలు తేలడానికి చాలా కాలం పడుతుంది. వీటితో పాటు జంతు సంక్షేమ నియమాలను కూడా ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తోంది. ప్రయోగశాలలో సృష్టించే ఈ హైబ్రిడ్ ప్రాణులు జన్మించిన తర్వాత వాటి జీవన విధానం, ఆరోగ్యం ఎలా ఉంటుందనే విషయాలపై భిన్నమైన వాదనలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+