వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి పదవికి నరేంద్ర గుడ్‌ బై

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః తెలంగాణా జెండా ఎగురవేసి కలకలం సృష్టించిన మెదక్‌ఎం.పి., బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ. నరేంద్ర పార్టీ పదవికి రాజీనామా చేశారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం జరిగినవిలేకరుల సమావేశంలో నరేంద్ర ప్రకటించారు. ఈ నెల 19 న కొత్తగా ఏర్పాటు చేయనున్న తెలంగాణా వేదికకు పూర్తి సమయాన్ని కేటాయించేందుకువీలుగా బిజెపి ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

తెలంగాణా పై తన వైఖరిని పార్టీ అధిష్టానానికివివరించేందుకు సోమవారం ఢిల్లీ వెళ్ళిన నరేంద్రకు అక్కడ చుక్కెదురైంది. ఆయనపై పార్టీ అధిష్ఠానం తీవ్రస్థాయిలో మండిపడినట్లు తెలిసింది. 2004 వరకు కొత్త రాష్ట్రాల ఊసులేదని బిజెపి చెబుతుండగామీరు తెలంగాణా వాదనను ఎలా సమర్థిస్తారని పార్టీ నేతలు నరేంద్రను నిలదీసినట్లు తెలుస్తున్నది.పైగా సిద్దిపేటలో జరుగుతున్న ఉపఎన్నికల్లో మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వననడం పార్టీ నియమాలను ఉల్లంఘించడం కాదా అనిసీనియర్‌ నేతలు నరేంద్రను ప్రశ్నించినట్లు తెలిసింది.

తనను పార్టీ పదవి నుంచి తప్పించడం అనివార్యం అని గ్రహించిన టైగర్‌ నరేంద్ర తాడో పేడో తేల్చుకొనే ఉద్దేశంతో పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 19న కొత్త పార్టీ ప్రకటనకుపెద్దఎత్తున సన్నాహాలు చేస్తున్నామని నరేంద్ర వెల్లడించారు. చంద్రశేఖర రావు తెలంగాణా ముఖ్యమంత్రి పదవి రేసులో ముందున్నారనే ఆలోచనతో నరేంద్రసరైన ప్రణాళిక లేకుండా వేరుకుంపటి పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారని బిజెపిసీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

  • నరేంద్ర సారథ్యంలో తెలంగాణ సదస్సు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X