దాణా కేసులు జార్ఖండ్‌కు బదిలీ
న్యూఢిల్లీః బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు వ్యతిరేకంగా పాట్నా హైకోర్టు విచారణలో వున్న 30 పైచిలుకు కేసులను జార్ఖండ్ రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఈ కేసులన్నీ దాణా కుంభకోణానికి సంబంధించినవే. కేసుకు సంబంధించిన ప్రాంతాలు కొత్తగా ఏర్పడిన జార్ఖండ్ రాష్ట్రంలో వున్న కారణంగా ఈ కేసులపైవిచారణను జార్ఖండ్ హైకోర్టుకు బదిలీ చేయడం సముచితంగా వుంటుందని సుప్రీంకోర్టుపేర్కొంది. కేసులను జార్ఖండ్‌కు బదిలీ చేయడం లాలూ ప్రసాద్‌కు చుక్కెదురుగా పరిశీలకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications