వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం దారి తప్పలేదు: జనా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ఉగ్రవాదంపై అమెరికా పోరు విషయంలో కేంద్ర ప్రభుత్వం లొంగిపోయేవిధంగా వ్యవహరించడం లేదని భారతీయ జనతా పార్టీ(బిజెపి) జాతీయాధ్యక్షుడు జనా కృష్ణమూర్తిఅన్నారు. భారతదేశం ఎవరి సహాయం లేకుండాఉగ్రవాదంపై పోరు చేయగలదని ఆయన అన్నారు. రాష్ట్ర పార్టీసమావేశంలో పాల్గొనడానికి ఆయన శనివారంహైదరాబాద్‌ వచ్చారు.

సెప్టెంబర్‌ 11దాడుల తర్వాతనే అమెరికా ఉగ్రవాదం సామర్థ్యాన్నిగ్రహించి వుంటుంది. ఈ విషయంపై మనం 15 ఏళ్లుగాహెచ్చరికలు చేస్తూ వస్తున్నాం అని ఆయనవిలేకరులతో అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగాప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి అమెరికా చేస్తున్నప్రయత్నాలను అభినందిస్తున్నామని, అమెరికాకుసహాయం చేయడానికి కేంద్రం దారి తప్పలేదని ఆయన అన్నారు. పోఖ్రాన్‌ అణు పరీక్షల తర్వాత భారత్‌ తనకాళ్లపై తాను నిలబడిందని, తనపై దాడిజరిగే వరకు ఉగ్రవాదం పట్ల అమెరికా ప్రేక్షక పాత్రనేపోషించిందని, ఆ తర్వాతనే మనపై అమెరికా ఆంక్షలు ఎత్తేసిందనిఆయన అన్నారు.

ఉగ్రవాదాన్ని,ఉగ్రవాద కార్యకాలాపాలను అరికట్టడానికి కేంద్రం తెచ్చినఆర్డినెన్స్‌ను బలపరచాలని ఆయన ప్రతిపక్షాలకువిజ్ఞప్తి చేశారు. ప్రస్తుత చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకునిఉగ్రవాదులు, వారి అనుచరులు తమ కార్యకలాపాలనుసాగిస్తున్నారని, ఈ స్థితిలో ఆర్డినెన్స్‌ను తేవడం తప్ప కేంద్రానికిమరో మార్గం లేదని ఆయన అన్నారు. వ్యతిరేకించాలి కాబట్టివ్యతిరేకించడమనే పద్ధతిలో కాకుండా విలువైన సూచనలు చేసి ఉగ్రవాదాన్ని అరికట్టడానికిఅవసరమైన చట్టంలోని లొసుగులను సరిదిద్దేందుకుసహకరించాలని ఆయన ప్రతిపక్షాలను కోరారు.

ప్రతిపక్షాలుభయపడినట్లుగా మానవ హక్కుల ఉల్లంఘనఏదీ జరగదని, ఈ ఆర్డినెన్స్‌ను తేవడాన్ని అనివార్యం చేసిన పరిస్థితులనుఅర్థం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నించాలనిఆయన అన్నారు. ఈ ఆర్డినెన్స్‌ను రాజకీయ ప్రయోజనాల కోసందుర్వినియోగం చేసే అవకాశాలు లేవని, ఉగ్రవాదాన్నిఅణచివేయడానికి మాత్రమే ఈ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వప్రయోగిస్తుందని కృష్ణమూర్తి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X