హైదరాబాద్‌ః రాష్ట్రంలోని రైతాంగం ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి రోజుకు కనీసం ఒక గంట సమయం కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ధాన్యం, మొక్కజొన్న, పత్తి సేకరణ షయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఆయనే స్వయంగా ప్రతిరోజు పరిస్థితిని సdుక్షించనున్నట్టుగా ప్రకటించారు.
అన్ని మార్కెట్ యార్డుల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రైతులకు లభించడంలో ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. రైతు సమస్యల షయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. మద్దతు ధరల షయంలో రైతులు ఇంకా మోసపోతునే వున్నారంటూ వస్తున్న వార్తల దరిులా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.
మద్దతు ధర షయంలో మాత్రమే కాకుండా ఇతరత్రా ఎదురయ్యే సమస్యలను కూడా రైతులు వెంటవెంటే అధికారులు దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన ఆదేశించారు. నాసిరకం ధాన్యం కొనుగోలు షయంలో మద్దతు ధరకంటే తక్కువ చెల్లించాలనుకున్నప్పుడు ఇద్దరు రైతు ప్రతినిధులు, ుల్లరు కలసి మార్కెటింగ్ అధికారి సమక్షంలో ధరను నిర్ణయించాల్సి వుంటుందని ఏకపక్షంగా ుల్లర్లు తమ రేట్లను రైతుల dుద రుద్దడానికి ప్రయత్నిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications
