హైదరాబాద్‌ః దేవాలయాల్లో ప్రభుత్వం ుతిdురిన జోక్యానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ అర్చక పరిషత్ సారథ్యంలో సోమవారం నాడు వేలాది మంది అర్చకులు హైదరాబాద్‌లో ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
ఆలయాల నిర్వహణలో ప్రభుత్వం అతిగా జోక్యం చేసుకుంటున్నదని వారు ఆరోపించారు. అన్యక్రాంతమైన దేవాలయాల భూముల స్వాధీనానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రదర్శన తర్వాత బొగ్గుల కుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయం ఎదుట వారు ధర్నా చేశారు.ఎండోమెంట్స్ చట్టాన్ని సవరించాలని, ధర్మకర్తలుగా అర్హులైనవారినే నియుంచాలనిఅర్చకులు నినాదాలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు కరువుభత్యం చెల్లించాలని కోరారు.












Click it and Unblock the Notifications
