వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ సామర్థ్యం మేరకే అప్పులు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చెప్పారు. అప్పుల గురించి ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టాలని ఆయన పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నాయకుల మూడో బ్యాచ్‌ శిక్షణా శిబిరాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. అప్పుల రూపంలో వచ్చే ప్రతి పైసాను సద్వినియోగం చేస్తున్నామని, దీన్ని ప్రతిపక్షాలు గుర్తించాలని ఆయన అన్నారు.

By Staff
|
Google Oneindia TeluguNews

తక్కువ వడ్డీతో ఎలాఅప్పులు తేవాలో, వాటిని ఎలా తిరిగి చెల్లించగలమో ఆలోచించి ప్రభుత్వం రుణాలు చేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించగలమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సంక్షేమానికి ముప్పు కలిగించబోవని ఆయన చెప్పారు. శాంతి భద్రతలకు ముప్పు కలుగజేసే సంఘ వ్యతిరేక శక్తులను కఠినంగా వ్యవహరిస్తామని ఆయన చెప్పారు.

రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో కృషి ద్వారా, నాయకులకు ఆరోగ్య పుష్టి కలిగించడం ద్వారాస్వర్ణాంధ్రను సాధించగలమని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 19 ఏళ్ల క్రితం పుట్టిన తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాల్లో కీలకమైన పాత్రను పోషించే స్థాయికి ఎదిగిందని ఆయన అన్నారు. నాయకుల ఆలోచనా సరళినిఅంచనా వేసి ఆయా నాయకులకు పదవులు ఇస్తామని ఆయన చెప్పారు.
.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X