పాక్ కాల్పుల్లో నలుగురు మృతి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ బలగాలు పౌరులపై గురువారం రాత్రి నుంచి జరిపిన కాల్పుల్లో ముగ్గురు పిల్లలతో సహా నలుగురు మరణించారు. పదకొండు మంది గాయపడ్డారు.
జబ్దీ ల్లు వద్ద పాకిస్థాన్ బలగాలు జరిపిన కాల్పుల్లో ఐదు నుంచి 11 ఏళ్ల మధ్య వయస్సు గల ముగ్గురు పిల్లలు మరణించారని, ఐదుగురు గాయపడ్డారని అధికార వర్గాలు చెప్పాయి. పాకిస్థాన్ బలగాలు కెర్నీ,లామ్, భవానీ, మేంధర్, బాలకోట్, క్రిష్ణగట్టి, నౌషీరా, పలన్‌వాలాలను కూడా లక్ష్యంగా ఎంచుకున్నట్లు ఆ వర్గాలు చెప్పాయి. అంతర్జాతీయ నియంత్రణ రేఖ వెంబడి పలు చోట్లు పాకిస్థాన్ రేంజర్లు కాల్పులు జరిపారు.












Click it and Unblock the Notifications
