హోమ్ పేజి
కరీంనగర్‌ః కరీంనగర్ జిల్లాలోని రేగొండ మండల ప్రధాన కేంద్రంలో మండల రెవిన్యూ కార్యాలయాన్ని పీపుల్స్‌వార్ నక్సలైట్లు మంగళవారం ఉదయం పేల్చివేశారు.
సుమారు పదిమంది సాయుధ నక్సలైట్లు తెల్లవారుజామునే గ్రేనేడ్లతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. నక్సలైట్ సమ్మయ్య నాయకత్వంలోని చిట్యాలదళం ఈ విధ్వంసంలో పాల్గొన్నట్టుగా తెలిసింది. సరసనపల్లి ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మండలకార్యాలయాన్ని పేల్చివేస్తున్నట్టుగా సంఘటన స్థలంలో వదిలిపెట్టిన లేఖలో నక్సలైట్లు పేర్కొన్నారు. కాగా ఎంఆర్‌వో కార్యాలయం అద్దెభవనంలో వుంది. రికార్డులు, ముఖ్యమైన ఫైళ్లు నాశనమై వుంటాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కాగా తనకేపాపం తెలియనప్పటికీ తన ఆస్తి ధ్వంసమయిందని ఇంటి యజమాని లబోదిబో అంటున్నారు.












Click it and Unblock the Notifications
