ఖాట్మండుః నేపాల్‌లో మావోయిస్టు తీవ్రవాదులు మరోసారి చెలరేగారు. ఖాట్మండుకు 350 కిలో మీటర్ల దూరంలో వున్న అచ్చం జిల్లాలో సాయుధ తీవ్రవాదులు విమానాశ్రయం, జిల్లా పాలనాయంత్రాంగం ప్రధాన కార్యాలయంపై దాడి జరిపి మారణహోమం సృష్టించారు.
ఈ దాడిలో కనీసం 53 మంది మరణించినట్టుగా చెబుతున్నారు. మృతుల్లో అత్యధిక శాతం మందిసెక్యురిటీ గార్డులు వున్నట్టుగా పోలీసులు చెప్పారు. జిల్లా పాలనాధికారి మోహన్‌సింగ్ ఖత్రీ ఆయనఅర్ధాంగి కూడా తీవ్రవాదులు దాడిలో మరణించారు. ఈ సంఘటనల గురించి తెలిసిన వెంటనే ప్రభుత్వంపెద్దఎత్తున సైనిక బలగాలను తరలించింది.సైన్యంతో జరిగిన ఘర్షణల్లో మరో నలుభైమంది మావోయిస్టులు మరణించినట్టుగా తెలిసింది. అయితే పూర్తివివరాలుఅందలేదు.