కరెంట్ కష్టాలు తీరుతాయి: బాబు
విశాఖపట్నం: రాష్ట్రంలోవిద్యుత్ సమస్యలు తీరిపోతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. పరువాడ వద్ద ఆయన శుక్రవారం సింహాద్రి సామర్లకోట థర్మల్ పవర్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టు ఉత్పత్తి చేసే విద్యుత్‌నంతటినీ ఆంధ్రప్రదేశ్‌కే ఇచ్చే ఏర్పాటు చేస్తామని కేంద్రవిద్యుత్ మంత్రి సురేష్ ప్రభు అన్నారు. జపాన్ ఆర్థిక సహాయంతో 3650 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. 500 మెగావాట్లవిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల మొదటి దశ పూర్తయింది. రెండో దశ ఆరు నెలల్లో పూర్తవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications
