హైదరాబాద్‌ః సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఆదివారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో సమావేశమైంది.
పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నరైల్వే, జనరల్ బడ్జెట్ విషయంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సమావేశంలో చర్చించినట్టుగా టిడిపిపి నేత ఎర్రన్నాయుడు చెప్పారు. రాష్ట్రానికి రావల్సిన ప్రాజెక్టులపై కేంద్రంమీద వత్తిడి తేవడానికి అనుసరించాల్సిన పద్దతులు,బడ్జెట్‌లో ప్రజలపై భారం వేసే ప్రతిపాదనలవిరమణకు కేంద్రంపై ఏవిధంగా వత్తిడి తేవాలనేఅంశాలను ఈ సమావేశంలో చర్చించారు. ఎన్‌డిఎకు మిత్రపక్షమైన కారణంగాబడ్జెట్ ప్రతిపాదనల విషయంలో తమ ప్రతిస్పందన ఆచితూచి వుండాలని తెలుగుదేశం భావిస్తున్నది.