హైదరాబాద్‌ః రాష్ట్రంలోని ఇంజనీరింగ్, మెడిసిన్, ఆర్కిటెక్చర్, డెంటల్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి 2002-2003 సంవత్సరానికి నిర్వహించనున్న ఎంట్రెన్స్ పరీక్షకు లక్షా ఎనభైవేల పైగా దరఖాస్తులు వచ్చాయి.
ఇంజనీరింగ్ విభాగానికి 1,43,536 దరఖాస్తులుఅందగా, మెడిసిన్ విభాగానికి 42,101 దరఖాస్తులుఅందాయి. రాష్ట్రంలోని 174 ఇంజనీరింగ్ కాలేజీల్లో 47 వేలసీట్లు వున్నాయి.మెడిసిన్ విభాగంలో 2500 సీట్లు వున్నాయి. క్రితం సారికంటే ఈ సారి ఈ రెండు విభాగాల్లోనూ దరఖాస్తుల సంఖ్యపెరిగింది.