ఖాట్మండుః నేపాల్‌లో భద్రతాదళాలు గత నలభై ఎనిమిది గంటల్లో 20 మంది మావోయిస్టు తీవ్రవాదులను కాల్చిచంపాయి. ఈ ఇరువై మందిని వేరువేరు ఎన్‌కౌంటర్లలో కాల్చిచంపినట్టు అధికారులు తెలిపారు.
వీరినుంచి హాండ్ గ్రేనెడ్స్, తుపాకులు, మందుగుండు సామాగ్రినిస్వాధీనం చేసుకున్నారు. గత నవంబర్‌లో నేపాల్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించిసైన్యాన్ని రంగంలోకి దించినప్పటి నుంచి పెద్ద సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు.